భారీ బడ్జెట్లో విజయ్ దేవరకొండ చిత్రం!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. తనదైన మార్కును క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్లో సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను భారీ బడ్జెట్లో రూపొందించాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. దీంతో పాటు విజయ్ దేరవకొండ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనూ ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు. ప్రస్తుతం కరోనా కారణంగా పూరి, విజయ్ దేవరకొండ హోల్డ్ అయ్యింది. పరిస్థితులు చక్కబడగానే హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారు. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, ఛార్మిలతో పాటు కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments