భార‌తీయుడు 2: ఓ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

శంక‌ర్ అంటేనే గ్రాండియ‌ర్‌. ప్ర‌తి సీన్‌ను తెర‌పై ఆయ‌న ఓ అద్భుతంగా ఆవిష్క‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చే్స్తుంటారు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌టాయ‌న‌. వివరాల్లోకెళ్తే.. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'భార‌తీయుడు 2'. 23 ఏళ్ల‌కు ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన 'భార‌తీయుడు' సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను బోపాల్‌లో చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఇదొక యాక్ష‌న్ ఏపిసోడ్. దాదాపు రెండు వేల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొనే ఈ యాక్ష‌న్ స‌న్నివేశం కోసం 40 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌ట‌. ఓ ఫైట్ కోసం ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయ‌డమంటే షాకింగ్ విష‌య‌మే. అయినా కూడా.. నిర్మాత‌ల‌ను క‌న్విస్ చేసి శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాడు. ఈ షెడ్యూల్‌ను బోపాల్‌లో 25 రోజుల పాటు చిత్రీక‌రించ‌నున్నారు.

శంక‌ర్‌కు ఒక‌ప్పుడు నిర్మాత‌లు అడిగినంత బ‌డ్జెట్‌ను ఇవ్వ‌డానికి రెడీ అన్నారు. కానీ ఆయ‌న 2.0 సినిమా స‌రైన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌డంలో విఫ‌లం కావ‌డంతో 'భార‌తీయుడు 2' బ‌డ్జెట్ విష‌యంలో ప‌రిమితులు ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ సినిమా కోసం ఓ ఫైట్ కో్సం న‌ల‌భై కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్ట‌డ‌మ‌నేది శంక‌ర్‌కు కాస్త త‌ల‌నొప్పి వ్య‌వ‌హార‌మే. అయితే మిగిలిన చోట్ల బ‌డ్జెట్‌ను కుదించి ఈ ఫైట్‌ను లావిష్‌గా చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. పీట‌ర్‌హెయిన్స్ మాస్ట‌ర్ ఈ ఆధ్వ‌ర్యంలో ఈఫైట్‌ను చిత్రీక‌రిస్తారు.

More News

ఏపీ ప్రజలకు జగన్ శుభావార్త.. నవంబర్ 1 నుంచి..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి వరాలజల్లు కురిపించారు. శుక్రవారం నాడు ఆరోగ్యశాఖపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం జరిగింది.

మరోసారి అదే డైరెక్టర్ తో మహేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో సినిమాలు చేయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. అయితే మ‌హేశ్‌కి మాత్రం న‌చ్చిన ద‌ర్శ‌కులు కొంత మందే.

రామ్ ‘డబుల్’ ప్రయత్నం ఫలించేనా!?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఊహించని హిట్టవ్వడంతో కుర్ర హీరో రామ్ మంచి ఊపు మీదున్నాడు.

ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్‌కు సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోకపోవడం..

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా.. కేసీఆర్ శాశ్వతం కాదు!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్‌ అశ్వద్ధామరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హాట్ హాట్ కామెంట్స్ చేశారు.