పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా అదేనట...

  • IndiaGlitz, [Thursday,January 28 2021]

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ మూవీస్‌పైనే దృష్టి సారించారు. అయితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి సారించలేదు. కానీ తాజాగా ఆయన కూడా భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే అది ఇప్పటికే పట్టాలు కూడా ఎక్కేసింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా రూపొందనుండటం విశేషం.

పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ వేస్తున్నారు. అలాగే రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా షూటింగ్ జరుపబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసేందుకు మేకర్స్ సైతం సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎమ్ రత్నం ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌నే కేటాయించారట. ఏకంగా 170 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

More News

‘శభాష్ మిథు’ కోసం బ్యాట్ పట్టిన తాప్సి..

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ ఆటగాళ్ల బయోపిక్‌లు వరుసగా లైన్‌లో ఉన్నాయి.

‘సలార్’లో శ్రుతి హాసన్ ఫిక్స్

విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన శ్రుతి హాసన్.. ఆ తరువాత తండ్రి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలుత ఐరన్ లెగ్ అని

మహిళలపై లైంగిక వేధింపులు.. కోయిలమ్మ సీరియల్ హీరోపై కేసు నమోదు

కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాగిన మైకంలో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై

'పుష్ప‌' రిలీజ్ డేట్ లాక్‌... ఫ్యాన్ష్ కోసం స్ట‌న్నింగ్ లుక్ ఇచ్చిన స్టైలిష్ స్టార్‌

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సినిమా థియేటర్లలో 50 శాతం నిబంధన సడలింపు..

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న లాక్‌డౌన్ మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది.