Hrithik Tarak:హృతిక్, తారక్ 'వార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వరుస సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'దేవర' సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించనున్నాడు. వీటితో పాటు తొలిసారిగా డైరెక్ట్ బాలీవుడ్ చిత్రంలో యాక్ట్ చేయనున్నాడు. 2019లో హృతిక్ రోషణ్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’కు సీక్వెల్‌గా.. యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో 6వ చిత్రంగా తెరకెక్కనున్న 'వార్ 2'లో విలన్ పాత్ర పోషించనున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్టేడ్ వచ్చేసింది.
2025, ఆగస్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ క్రిటిక్ తరుణ్ అదర్శ్ తెలిపాడు. లాంగ్ వీకెండ్ రావడంతో ఆ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు పేర్కొన్నాడు. 14న గురువారం, 15న ఇండిపెండెన్స్ డే హాలిడే, 16,17 వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్స్ రాబట్టేలా మేకర్స్ ప్లాన్ చేశారని వెల్లడించాడు. ఇక 2024 ఫిబ్రవరి నుంచి ‘వార్ 2’ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. ముంబైలో జరగనున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మీద యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నారట. ఈ స్పై యూనివర్స్ మొత్తానికి ఎన్టీఆర్ మెయిన్ విలన్ కాబోతున్నారట. ఇటీవల రిలీజ్ అయిన 'టైగర్ 3' మూవీ చివరిలో ఒక కొత్త విలన్ గురించి తెలియజేశారు. ఆ విలన్ ఎన్టీఆరే అంటున్నారు. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో హీరోలుగా ఉన్న సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్.. ఎన్టీఆర్‌ని ఓడించడానికి కలిసి పోరాటం చేయనున్నారట.
ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్‌తో తారక్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా.. మరో సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ ముఖ్యమైన అతిధి పాత్రలో నటిస్తున్నారట. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న మొదటి భాగం విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com