ఆ ద‌ర్శ‌కుడి ఆఫ‌ర్ వ‌ద్ద‌న్న హీరో...

  • IndiaGlitz, [Tuesday,July 10 2018]

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ సినిమా చేయ‌డానికి బాలీవుడ్ తార‌లు ఆస‌క్తి చూపిస్తుంటారు. 'ప‌ద్మావ‌త్' త‌ర్వాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ సినిమా మ‌ల‌యాళ సినిమాకు రీమేక్‌.

మ‌లయాళ స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన 'పులి మురుగ‌న్‌' వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు భ‌న్సాలీ.

హీరోగా హృతిక్ రోష‌న్ అయితే స‌రిపోతాడ‌ని భావించిన ఆయ‌న.. హృతిక్‌ను సంప్ర‌దిస్తే.. ఉన్న క‌మిట్‌మెంట్స్ దృష్ట్యా హృతిక్ సినిమా చేయ‌లేన‌ని చెప్పేశాడ‌ని.. భ‌న్సాలీ మ‌రో హీరోని సంప్ర‌దించే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.