రానాని చూసి స్పూర్తి పొందానంటున్న బాలీవుడ్ హీరో..

  • IndiaGlitz, [Saturday,December 12 2015]

రానా ని చూసి స్పూర్తి పొందానంటున్న బాలీవుడ్ హీరో..ఎవ‌రో కాదు హ్రుతిక్ రోష‌న్. అవును ఇది నిజంగా నిజం. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..వ‌ర‌ద భీభ‌త్స‌వం వ‌ల‌న ఇబ్బంది ప‌డుతున్న చెన్నై ప్ర‌జానికాన్ని ఆదుకునేందుకు రానా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

రామానాయుడు ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా మ‌న మ‌ద్రాసు కోసం అంటూ రానా క్యాంపెయిన్ ప్రారంభించారు. రానా, మంచు ల‌క్ష్మితో పాటు మ‌రి కొంత మంది యువ హీరోలు ఈ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. రానా చేస్తున్న‌సేవా కార్య‌క్ర‌మం బాలీవుడ్ హీరో హ్రుతిక్ రోష‌న్ మ‌న‌సుని క‌దిలించింది. అంతే....స‌మ‌యం కేటాయించి సేవ‌ చేయ‌డం క‌న్నా గొప్ప ఏముంటుంది..రానా నాలో స్పూర్తిని నింపావ్ అంటూ హ్రుతిక్ రోష‌న్ ట్విట్ట‌ర్ లో స్పందించారు. కేవ‌లం మాట‌లే కాకుండా త‌న వంతుగా 25 ల‌క్ష‌లు సహాయం కూడా రామానాయుడు ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ కి పంపారు హ్రుతిక్.

ప్ర‌శంస‌లే కాకుండా స‌హాయం కూడా చేసిన హ్రుతిక్ రోష‌న్కి థ్యాంక్స్ చెప్పాడు రానా. అది సంగ‌తి.

More News

శివబాలాజీ 'స్నేహమేరా జీవితం' 80 శాతం పూర్తి...

శివ బాలాజీ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం స్నేహమేరా జీవితం. ధన్ విన్ కాంగుల సమర్పణలో గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చితం ‘పడ్డానండీ ప్రేమలో మరి’వంటి క్యూట్ లవ్ స్టోరీని...

శృతి రోల్ ఏంటంటే...

తెలుగులో మహేష్ సరసన ‘శ్రీమంతుడు’తమిళంలో అజిత్ సరసన ‘వేదాళం’సక్సెస్లు కొట్టిన శృతిహాసన్ బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది.

హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ రజనీకాంత్...

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నస్టార్...సూపర్ స్టార్ రజనీకాంత్.డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు.

త్రిష సన్నబడుతుంది...

అవును అల్రెడి సన్నగా ఉండే చెన్నై సొగసరి త్రిష మళ్ళీ సన్నబడటానికి ప్రయత్నిస్తుంది.

'రోబో2'కు ముహుర్తం కుదిరిందా?

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సూపర్హిట్ చిత్రం ‘రోబో’సీక్వెల్ ‘రోబో2’కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.