రానాని చూసి స్పూర్తి పొందానంటున్న బాలీవుడ్ హీరో..
Send us your feedback to audioarticles@vaarta.com
రానా ని చూసి స్పూర్తి పొందానంటున్న బాలీవుడ్ హీరో..ఎవరో కాదు హ్రుతిక్ రోషన్. అవును ఇది నిజంగా నిజం. ఇంతకీ విషయం ఏమిటంటే..వరద భీభత్సవం వలన ఇబ్బంది పడుతున్న చెన్నై ప్రజానికాన్ని ఆదుకునేందుకు రానా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
రామానాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన మద్రాసు కోసం అంటూ రానా క్యాంపెయిన్ ప్రారంభించారు. రానా, మంచు లక్ష్మితో పాటు మరి కొంత మంది యువ హీరోలు ఈ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. రానా చేస్తున్నసేవా కార్యక్రమం బాలీవుడ్ హీరో హ్రుతిక్ రోషన్ మనసుని కదిలించింది. అంతే....సమయం కేటాయించి సేవ చేయడం కన్నా గొప్ప ఏముంటుంది..రానా నాలో స్పూర్తిని నింపావ్ అంటూ హ్రుతిక్ రోషన్ ట్విట్టర్ లో స్పందించారు. కేవలం మాటలే కాకుండా తన వంతుగా 25 లక్షలు సహాయం కూడా రామానాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ కి పంపారు హ్రుతిక్.
ప్రశంసలే కాకుండా సహాయం కూడా చేసిన హ్రుతిక్ రోషన్‌కి థ్యాంక్స్ చెప్పాడు రానా. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments