హృతిక్ సినిమా ఆగింది

  • IndiaGlitz, [Wednesday,May 29 2019]

బాలీవ‌డ్ క‌థానాయ‌కుడు హృతిక్ రోష‌న్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో నెల‌కొన్న ఉద్రిక్త‌త కార‌ణంగా సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆపు చేశారు. వివరాల్లోకెళ్తే.. హృతిక్‌, టైగర్‌ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది. షూటింగ్‌లో భాగంగా ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు ఉగ్ర‌వాదుల వేషాలు వేసుకున్నారు.

షాట్ గ్యాప్‌లో వాళ్లు అదే వేష‌ధార‌ణ‌తో ప‌క్క‌నే ఉన్న దుకాణానికి వెళ్లారు. ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చింది. ఆ జూనియ‌ర్ ఆర్టిస్టులు అస‌లైన ఉగ్ర‌వాదులుగా భావించిన స్థానికులు పోలీసుల‌కు ఫోన్ చేశారు. తాము జూనియ‌ర్ ఆర్టిస్టుల‌మ‌ని ఎంత చెప్పినా విన‌కుండా పోలీసులు వారిద్ద‌రినీ అరెస్ట్ చేశారు. విష‌యం తెలుసుకున్న నిర్మాత‌లు త‌గిన ఆధారాల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి వారిని విడిపించారు. ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగే వ‌ర‌కు షూటింగ్‌ను యూనిట్ తాత్కాలికంగా ఆపేసింది.

More News

జగన్‌ ప్రమాణానికి చిరు, పవన్ వస్తారా..!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే-30న

నాకు మంత్రి పదవి వద్దు.. మోదీకి జైట్లీ లేఖ

భారతీయ జనతాపార్టీ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగరేసి.. ఎవరి సహాయ సాకారాలు లేకుండా సింగిల్‌గానే ఊహించని మెజార్టీ దక్కించుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఎస్.. సున్నానే వేస్తారు.. ఇంటర్ బోర్డు కార్యదర్శి బెదిరింపులు!

తెలంగాణలో ఇంటర్ మంటలు ఇంకా చల్లారలేదు. ఇటీవలే సప్లిమెంటర్ ఫలితాలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు మరోసారి వివాదాస్పదమైంది. విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు

కవిత కోసం ఎమ్మెల్యే త్యాగం.. రాజీనామా చేసేందుకు రెడీ!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నిజామాబాద్ నుంచి పోటీచేసిన కవితపై బీజేపీ తరఫున పోటీచేసిన అరవింద్ భారీ మెజార్టీతో విజయ డంఖా మోగించారు.

జగన్ ప్రమాణ స్వీకారానికి నేను వెళ్లను..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివీనీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలిచి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.