హృతిక్ సినిమా ఆగింది
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ సినిమా షూటింగ్ సమయంలో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆపు చేశారు. వివరాల్లోకెళ్తే.. హృతిక్, టైగర్‌ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. షూటింగ్లో భాగంగా ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉగ్రవాదుల వేషాలు వేసుకున్నారు.
షాట్ గ్యాప్‌లో వాళ్లు అదే వేషధారణతో పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లారు. ఇక్కడే అసలు చిక్కొచ్చింది. ఆ జూనియర్ ఆర్టిస్టులు అసలైన ఉగ్రవాదులుగా భావించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. తాము జూనియర్ ఆర్టిస్టులమని ఎంత చెప్పినా వినకుండా పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న నిర్మాతలు తగిన ఆధారాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిని విడిపించారు. ఈ గొడవ సద్దుమణిగే వరకు షూటింగ్‌ను యూనిట్ తాత్కాలికంగా ఆపేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com