శ్రీమంతుడి వివాదంలోకి హృతిక్
- IndiaGlitz, [Wednesday,July 05 2017]
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌కు కోర్టు సమన్లు అందాయి. ఇంతకు హృతిక్ చేసిన తప్పేంటో తెలుసా..శ్రీమంతుడు సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకోవడం. 2012లోను తాను వీక్లి మేగజైన్లోని రాసిన చచ్చేంత ప్రేమ అనేనవల ఆధారంగా శ్రీమంతుడు సినిమా తీశారని శరత్ చంద్ర అనే వ్యక్తి కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే.
కోర్టు ఈ వ్యవహరంలో 'శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన మహేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ ఎర్నేనిలకు నోటీసులు అందించింది. ఇంకా కేసు కోర్టులోనే ఉంది. ఈ దశంలో హృతిక్ రీమేక్ గురించి వార్తలు బయటకు పొక్కడంతో కోర్టు హృతిక్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. హృతిక్ కోర్టుకు హాజరు కాకపోవడంతో సమన్లను జారీ చేసింది.