ఒకరోజు ముందుగానే 'బలం' చూపించ బోతున్న హృతిక్ రోషన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రాన్ని తెలుగులో బలం అనే పేరుతో విడుదల చేస్తున్నారు. గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ బలం తో తెలుగు ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ చిత్రం లో హ్రితిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది.
రాకేష్ రోషన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. లవ్ అండ్ యాక్షన్ లవ్‌స్టోరీతో సాగే ఈ సినిమాలో హృతిక్ డిఫరెంట్ పాత్ర ఆడియెన్స్‌కు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా ఆంధ్రా, నిజాం ఏరియా హక్కులను రాజశ్రీ సంస్థ దక్కించుకోగా, కర్ణాటక హక్కులను యాష్ రాజ్ సంస్థ దక్కించుకుంది. మళయాలం హక్కులను ప్రఖ్యాత నటుడు మోహన్ లాల్ దక్కించుకున్నారు.
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల చేద్దామనుకున్నారు. అయితే సినిమా ఇప్పుడు జనవరి 25న విడుదల అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments