హృతిక్ - కంగనా వివాదంలో షాకింగ్ ట్విస్ట్..
Friday, April 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్- బాలీవుడ్ భామ కంగనా వీళ్లిద్దరు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కంగనా విమర్శలు ఎక్కువ అవ్వడంతో ఇక లాభం లేదనుకుని హృతిక్ ఏకంగా నోటిసులు పంపించాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరి ముందు కంగనా క్షమాపణలు చెప్పాలన్నాడు హృతిక్ రోషన్. కంగనా కూడా హృతిక్ కి నోటిసులు పంపించింది. తనకు హృతిక్ రోజుకు యాభై ఈమెయిల్స్ పంపించే వాడని చెప్పింది. అలాగే హృతిక్ ఈమెయిల్స్ నుంచి తనకు అసభ్యకర సందేశాలు, ఫోటోలు, వీడియోలు వచ్చేవని చెప్పింది... ఇలా ఒకరి పై ఒకరు కేసులు పెట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
అయితే...పోలీసులు రంగంలోకి దిగాక పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హృతిక్ రోషన్ కంగనాకి ఈమెయిల్స్ పంపలేదని తెల్చేసారు. అయితే కంగనా నుంచి హృతిక్ రోషన్ కి ఆరు నెలల్లో మూడు వేల ఈమెయిల్స్ వెళ్లాయట. అయితే ఈ వివాదంలో షాకింగ్ ట్వి్స్ట్ ఏమిటంటే... హృతిక్ ఈమెయిల్ తో ఉన్న ఫేక్ ఈమెయిల్ తో కంగనాని ఎవరో బోల్తా కొట్టించారట. హృతిక్ ఏడేళ్లల్లో నాలుగు సార్లు మాత్రమే కంగనాతో మాట్లాడాడట. ఈ వివాదంలో హృతిక్ తప్పు ఏమీ లేదని తెలింది. అయితే కంగనా నుంచి వచ్చిన ఈ మెయిల్స్ కాపీలను హృతిక్ రోషన్ పోలీసులకు అందచేసాడు. ఫైనల్ ట్విస్ట్ ఏమిటంటే... పోలీసులకు అందచేసిన కంగనా ఈ మెయిల్స్ కాపీలు లీక్ అవ్వడం.. హాట్ టాపిక్ అయ్యింది. మరి..హృతిక్ తప్పు ఏమీ లేదని తేలింది. ఇప్పుడు కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment