ఏపీలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..?

  • IndiaGlitz, [Monday,May 13 2024]

ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఉదయం 9 గంటలకు 9.30శాతం నమోదైంది. ఇక ఉదయం 11 గంటల సమయానికి ఏపీ వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ 23.4 శాతంగా నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఓటు వేసిన వారిలో మహిళలు 24.17 శాతం, పురుషులు 23.68 శాతం ఉన్నారు.

అత్యధికంగా నంద్యాలలో 25.85, శ్రీశైలంలో 22.80 శాతం, డోన్ లో 23.30 శాతం, నందికొట్కూరులో 20.36 శాతం ఓటింగ్ శాతం నమోదైందని అధికారులు ప్రకటించారు. ఇక కర్నూలులో 22.05, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 18.61 శాతం, అనకాపల్లిలో 19.75 శాతం, అనంతపురంలో 23.9, అన్నమయ్యలో 22.28 శాతం, బాపట్లలో 26.88, చిత్తూరులో 28. 82 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అలాగే కోనసీమ జిల్లాలో 26.74 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 21.75, ఏలూరులో 24.28, గుంటూరులో 20.84 శాతం ఓటింగ్ నమోదు కాగా.. కాకినాడలో 21.26 శాతం, కృష్ణా జిల్లాలో 25.84 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 21.39, పల్నాడు జిల్లాలో 23.25 శాతం చొప్పున పోలింగ్ నమోదు అయింది.

ఇక అన్ని పార్టీల అధినేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం జగన్ దంపతులు పులివెందులలో భాకరాపురంలో ఓటు వేశారు. చంద్రబాబు దంపతులు, లోకేష్‌ దంపతులు మంగళగిరిలో ఓటు వేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ దంపతులు కూడా మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలకృష్ణ హిందూపురంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

More News

Rakshana: పాయ‌ల్ రాజ్‌పుత్ ‘ర‌క్ష‌ణ‌’...టైటిల్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ‘ర‌క్ష‌ణ‌’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Shivam Baje: 'శివం భజే' ఫస్ట్ లుక్ విడుదల!!

అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'శివం భజే'.

Poll Strategy: ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం.. తగ్గేదేలే..

ఏపీలో పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు

తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం బంద్.. మూగబోయిన మైకులు..

తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర నెలలుగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఏపీలో అధికారం దక్కించుకునేందుకు అధికార వైసీపీ,

Ram Charan - Allu Arjun: కోనసీమలో రామ్‌చరణ్.. రాయలసీమలో అల్లు అర్జున్ సందడి..

ఈసారి ఏపీ ఎన్నికల్లో సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తరపున పిఠాపురంలో మెగా హీరోలు, జబర్దస్త్ నటులు, నిర్మాతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.