ఏపీలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. ఉదయం 9 గంటలకు 9.30శాతం నమోదైంది. ఇక ఉదయం 11 గంటల సమయానికి ఏపీ వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ 23.4 శాతంగా నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఓటు వేసిన వారిలో మహిళలు 24.17 శాతం, పురుషులు 23.68 శాతం ఉన్నారు.
అత్యధికంగా నంద్యాలలో 25.85, శ్రీశైలంలో 22.80 శాతం, డోన్ లో 23.30 శాతం, నందికొట్కూరులో 20.36 శాతం ఓటింగ్ శాతం నమోదైందని అధికారులు ప్రకటించారు. ఇక కర్నూలులో 22.05, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 18.61 శాతం, అనకాపల్లిలో 19.75 శాతం, అనంతపురంలో 23.9, అన్నమయ్యలో 22.28 శాతం, బాపట్లలో 26.88, చిత్తూరులో 28. 82 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అలాగే కోనసీమ జిల్లాలో 26.74 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 21.75, ఏలూరులో 24.28, గుంటూరులో 20.84 శాతం ఓటింగ్ నమోదు కాగా.. కాకినాడలో 21.26 శాతం, కృష్ణా జిల్లాలో 25.84 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 21.39, పల్నాడు జిల్లాలో 23.25 శాతం చొప్పున పోలింగ్ నమోదు అయింది.
ఇక అన్ని పార్టీల అధినేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం జగన్ దంపతులు పులివెందులలో భాకరాపురంలో ఓటు వేశారు. చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు మంగళగిరిలో ఓటు వేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ దంపతులు కూడా మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలకృష్ణ హిందూపురంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout