రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతావ్ ? రష్మికకు నెటిజన్ ప్రశ్న!
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ లో ప్రస్తుతం రష్మిక క్రేజ్ పీక్స్ లో ఉంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో రష్మిక అవకాశాలు అందుకుంటోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తక్కువ టైంలోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా రష్మిక ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది. వారడిగిన ప్రశ్నలకు రష్మిక సమాధానం ఇచ్చింది.
నెటిజన్లు అడిగిన చాలా ప్రశ్నలకు రష్మిక ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ షిప్, అల్లు అర్జున్ తో కలసి పుష్పలో నటించడం ఇలా అనేక విషయాలని ఈ కన్నడ బ్యూటీ పంచుకుంది. విజయ్ దేవరకొండతో తనకు మంచి స్నేహం మాత్రమే ఉందని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. అంత ఖరీదా?
అలాగే అల్లు అర్జున్ తో కలసి నటిచడం ఎలా ఉంది అని ప్రశ్నించగా.. అల్లు అర్జున్ సర్ తో కలసి నటించడం నాకు చాలా ఇష్టం. ఆయన సెట్స్ లో ప్రొఫెషనల్ గా ఉంటారు. అద్భుతమైన డాన్సర్, నటుడు ఆయన రష్మిక తెలిపింది.
మరో నెటిజన్ రష్మికకు విభిన్నమైన ప్రశ్న సంధించాడు. సాధారణంగా కొందరికి ఇలాంటి ప్రశ్నలతో చికాకు వస్తుంది. కానీ రష్మిక సహనంతో ఆ నెటిజన్ కు సమాధానం ఇచ్చింది. మీరు రోజుకు ఎన్ని సిగరెట్స్ కాల్చుతారు అని అడిగాడు. దీనికి రష్మిక.. నాకు సిగరెట్ స్మోకింగ్ నచ్చదు. స్మోక్ చేసేవారికి దూరంగా ఉంటాను అని రష్మిక సమాధానం ఇచ్చింది.
ఛలో తర్వాత గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలతో రష్మిక విజయాలు దక్కించుకుంది. ఆమె గ్లామర్ యువతని అట్రాక్ట్ చేసే విధంగా ఉండడం, వరుస విజయాలు దక్కడంతో రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com