జ్యోతిక‌కు కార్తీ ఏమ‌వుతాడు

  • IndiaGlitz, [Monday,April 15 2019]

జ్యోతిక‌కు కార్తీ ఏమ‌వుతాడు... మ‌రిది అవుతాడు. భ‌ర్త సూర్య‌కు స్వ‌యానా త‌మ్ముడు మ‌రిదే క‌దా అవుతాడు. కానీ త‌మ్ముడు అవుతాడు అని అంటున్నారు జీతు జోసెఫ్‌. మ‌ల‌యాళంలో 'దృశ్యం', త‌మిళంలో 'పాప‌నాశ‌నం' చిత్రాల‌ను తెర‌కెక్కించింది ఇత‌నే. తాజాగా అత‌ను జ్యోతిక‌, కార్తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌నున్నారు.

ఈ చిత్రంలో జ్యోతిక బ్ర‌ద‌ర్‌గా కార్తి న‌టించ‌నున్నార‌ట‌. అక్కా,త‌మ్ముళ్ల మ‌ధ్య అనుబంధంతో సాగే చిత్రంగా ఈ సినిమా క‌థ‌ను మ‌లిచార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే జ్యోతిక త‌మ్ముడు సూర‌జ్ ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

కార్తి ప్ర‌స్తుతం లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖైదీ', భాగ్య‌రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ష్మికా మండ‌న‌తో క‌లిసి మ‌రో సినిమాలో న‌టిస్తున్నారు. జ్యోతిక కూడా మ‌రో రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. సో వీరిద్ద‌రు కాల్షీట్‌లు అడ్జ‌స్ట్ చేసుకుని మ‌రీ ఈ సినిమా కోసం ప‌నిచేస్తున్నారు.

More News

మరోసారి తెరపైకి ‘డేటాచోరీ కేసు’.. ఇదే నిజమైతే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘డేటాచోరీ కేసు’ ఎన్నికల అనంతరం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

'చిత్ర‌ల‌హ‌రి' ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం - మెగాస్టార్ చిరంజీవి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'.

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం తీవ్ర అసంతృప్తి

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు.. ఈసీపై కన్నెర్రజేసింది.

జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. నేను చచ్చిపోవాలా!?

ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా.. నేను గెలిస్తే..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల సీజన్ ముగియడంతో ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..?