మహాభారతానికి సంబంధమేంటి?
Send us your feedback to audioarticles@vaarta.com
మన ఇతిహాసాల్లో మహాభారతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో రూపొందే చిత్రాల్లో చాలా వరకు మహాభారతం అనే చుట్టూనే తిరుగుతుంటాయి. అంతెందుకు తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన `బాహుబలి` సినిమా కూడా భారతం నుండి పుట్టిందే. మరి ఇంత గొప్ప ఇతిహాసానికి, నితిన్ హీరోగా నటించిన `లై` చిత్రానికి సంబంధం ఏమిటి?.. `లై` టీజర్ చూసిన వారికి అదే సందేహం కలుగుతుంది.
`కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామ హతః కుంజరః` అంటూ అర్జున్ చెప్పే డైలాగ్ ఒకవైపు, మరోవైపు నితిన్ స్టయిలిష్ లుక్‌తో విలన్స్ భరతం పడటం చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతుంది. నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments