వైయస్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్లో ఎలా చేరారు..? రచ్చబండలో షర్మిలకు సూటి ప్రశ్న..
Send us your feedback to audioarticles@vaarta.com
జిల్లాల పర్యటన చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గం ములగపుడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిలకు ఓ కార్యకర్త నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబంను వేధించిందని.. వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిందని.. జగన్ను అన్యాయంగా జైల్లో పెట్టిందని అడిగాడు. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మీకు అండగా నిలబడ్డారు.
వైయస్ కుటుంబానికి చేసిన కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మీరు తప్పుపట్టారని గుర్తు చేశాడు. అలాంటి పార్టీలో మీరు ఇప్పుడు చేరి గెలిపించండని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించాడు. గతంలో జగనన్న వెంట నడిచి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటని నిలదీశాడు. అప్పుడు ఉన్న నిజాయితీ, ఇప్పుడు ఎందుకు లేదన్నాడు. వైయస్ జగన్ పాలనతో ప్రజలంగా సుభిక్షంగా ఉన్నారని.. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఈ హఠత్ పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరయ్యారు.
దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె దాటవేత ధోరణి అవలంభించారు. గతంలో చెప్పిన సమాధానమే మళ్లీ చెప్పారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల సమాధానం వింటే తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్లో చేరినట్లు అర్థమవుతోందని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.
వైఎస్ కుటుంబాన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన విషయం ఎలా మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు. సొంత సోదరుడు జగన్ను అక్రమంగా జైల్లో పెట్టి హింసించిన సంగతి పార్టీ తరపున వకాల్తా పుచ్చుకోవడం దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. మీకు పదవి ఇవ్వలేదనే కక్షతో చంద్రబాబు ఉచ్చులో ఇరుక్కుని జగన్ మీదే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. తండ్రి పేరును ముద్దాయిగా చేర్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు వైఎస్సార్ బిడ్డగా చెప్పుకునే అర్హత కూడా లేదని విమర్శిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout