3 నెలలు ఇంటి అద్దె వసూలు చేయొద్దు: కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల పాటు ఇంటి అద్దె వసూలు చేయొద్దని ఓనర్స్కు సీఎం కేసీఆర్ ఒకింత వార్నింగ్.. విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అద్దె ఇచ్చి తీరాల్సిందేనని ఇబ్బంది పెడితే 100కు కాల్ చేయాలని కేసీఆర్ సూచించారు. ఇది ఒక యాక్ట్ ప్రకారమే చేస్తున్నామని కేసీఆర్ తేల్చిచెప్పారు. మూడు నెలల తర్వాత వడ్డీలు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఈ మూడు నెలల కిరాయి వడ్డీ లేకుండా తర్వాత వాయిదాల వారీగా చెల్లించొచ్చని కేసీఆర్ తెలిపారు.
ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని.. వారిని ఇబ్బంది పెట్టొద్దని స్కూల్స్ యజమాన్యానికి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పలు కీలక విషయాలను కేసీఆర్ వెల్లడించారు.
పోలీసులకు తియ్యటి శుభవార్త చెప్పిన కేసీఆర్
లాక్ డౌన్ నేపథ్యంలో అలుపెరగని పోరాటం చేస్తూ విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులకు తెలంగాణ సీఎం కేసీఆర్ తియ్యటి శుభవార్త చెప్పారు. వారికి ఇచ్చే ఫుల్ శాలరీతో పాటు పదిశాతం అదనంగా వేతన ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇది సీఎం గిఫ్ట్ కింద ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో మాత్రం ముందులాగా కోతలు కొనసాగుతాయన్నారు. విద్యుత్ ఉద్యోగులకు కూడా పూర్తి వేతనం ఇవ్వాలని ఇవాళ కేబినెట్లో నిశితంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. పెన్షనర్లకు 75 శాతం ఇస్తామని హామీ ఇచ్చారాయన. వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు ఏప్రిల్ మాసంలోనూ ప్రోత్సాహకాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
-నెలవారీగా మాత్రమే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలి
- నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం విద్యాసంస్థల అనుమతులు రద్దు చేస్తాం.
- మే 7 తర్వాత కూడా శుభకార్యాలు, పెళ్లిళ్లకు అనుమతించం.
- ఫంక్షన్ హాల్స్ అన్నింటినీ తాత్కాలిక గోదాములుగా వాడుకోవచ్చు.
- వచ్చే నెల కూడా 12 కిలోల బియ్యం, రూ 1500 ఇస్తాం
- నగదు పంపిణీపై దుష్ప్రచారం నమ్మి బ్యాంకుల వద్ద గుమిగూడవద్దు. అకౌంట్లో వేసిన డబ్బులు వాపస్ తీసుకోం.
- వలస కూలీలకు 12 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాం
- ఆసరా పెన్షన్లు యథావిధిగా ఇస్తాం.
- ఏప్రిల్, మే నెలల్లో పరిశ్రమలకు విద్యుత్ ఫిక్స్ డ్ చార్జీలు రద్దు
- కోవిడ్ స్పెషల్ ఆస్పత్రిగా గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మారుస్తున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com