Bigg Boss Telugu 7 : పాత టాస్క్‌లతో కొత్త గేమ్స్ ఆడించిన బిగ్‌బాస్.. ఒకరి కోసం ఒకరు కష్టపడ్డ కంటెస్టెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా.. అర్జున్, అమర్‌దీప్, శివాజీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లు ఫినాలే వీక్‌లో అడుగుపెట్టినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం ఎలాంటి నామినేషన్స్, గేమ్స్, టాస్క్‌లు లేకుండా కంటెస్టెంట్స్‌ని ఫ్రీగా వదిలేశాడు బిగ్‌బాస్. ఇన్ని రోజుల జర్నీలో వారు సాధించినది, తీపి గుర్తులు, సంతోషం, బాధ అన్నింటిని గుర్తుచేస్తున్నాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా కంటెస్టెంట్స్‌కు తమ జర్నీని చూసుకున్నారు. ఇక గురువారం హౌస్‌మేట్స్‌కి వారి కుటుంబ సభ్యులు ఇష్టమైన వంటకాలు పంపారు. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఫ్యామిలీ మెంబర్స్ పంపిన వంటకాలను దక్కించుకోవాలంటే కొన్ని గేమ్స్ ఆడి గ్రహాంతర వాసులను మెప్పించాలని చెప్పాడు.
ముందుగా అర్జున్‌కు అతని భార్య మటన్ కర్రీ, రాగి సంగటి పంపింది. కానీ అర్జున్‌కు అది దక్కాలంటే యావర్ షేక్ బేబీ షేక్ గేమ్ గెలవాలని బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ సందర్భంగా అర్జున్, యావర్‌లు హోరాహోరీగా తలపడిన టాస్క్ ఇది. అయితే ఇప్పుడు మాత్రం అర్జున్ కోసం యావర్ అద్భుతంగా ఆడి గెలిచాడు. దీంతో అర్జున్ ఇంటి సభ్యులతో కలిసి మటన్ కర్రీ, రాగి సంగటిని ఆరగించాడు. తర్వాత శివాజీకి ఇంటి నుంచి భోజనం వచ్చింది. దానితో పాటు శివాజీకి తన కొడుకు వీడియో సందేశం పంపాడు. హైదరాబాద్‌కు వచ్చిన తొలి రోజుల్లో పార్క్‌లో నిద్రపోయేవాడినని, ఆకలితో నీళ్లు తాగి కడుపు నింపుకున్నానని చెప్పావు డాడీ. ఏ ప్రేక్షకులు నీకు ఆకలి భయం పోగొట్టారో.. అదే ప్రేక్షకుల తరపున నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ చికెన్ కర్రీ పంపిస్తున్నా అని శివాజీ కొడుకు చెప్పాడు. దీంతో ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఈ చికెన్ కర్రీ శివాజీకి దక్కాలంటే ప్రియాంక టాస్క్ ఆడి గెలవాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ సమయంలో యావర్, ప్రియాంక, శివాజీలు విల్లు మీద బాల్స్‌ను బ్యాలెన్స్ చేసే టాస్క్‌ను శివాజీ కోసం ప్రియాంక మరోసారి ఆడాలని చెప్పాడు. బజర్ మోగేంత వరకు విల్లుపై రెండు బాల్స్‌ను బ్యాలెన్స్ చేయాలని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ప్రియాంక ఆ గేమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఆడి గెలవడంతో శివాజీకి తన ఇంటి భోజనం దక్కింది.
అనంతరం అమర్‌దీప్ వంతు వచ్చింది. ఇతనికి తన భార్య తేజస్విని పంపిన రొయ్యల బిర్యానీ లభించాలంటే శివాజీ ఆడి గెలవాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఇందుకోసం ఓటు అప్పీల్ సమయంలో బెలూన్ టాస్క్‌ను ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీని ప్రకారం పిన్ ఉన్న టోపీని పెట్టుకొని వేలాడుతున్న బెలూన్స్‌ని మూడు నిమిషాలలోపు పగలగొట్టాల్సి వుంటుంది. దీనిని శివాజీ గెలిచి అమర్‌దీప్‌కు ఫుడ్ అందించాడు. తర్వాత ఎపిసోడ్‌లో ఎవరెవరు ఎంతసేపు కనిపిస్తారు అని కంటెస్టెంట్స్ చెప్పాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ సందర్భంగా అమర్‌కు శివాజీ క్లాస్ పీకారు. మనం చేసిన పనులన్నీ పదే పదే చూస్తే బోర్ కొడుతుందని.. రెండు వారాలు తప్పించి అంతకుముందు నువ్వు ఏం చేయలేదనే ఫీలింగ్ కలుగుతోందన్నారు. ఇంత టాలెంట్ పెట్టుకుని వీడికేం మాయరోగం అని తానే ఫీల్ అయ్యానని శివాజీ కామెంట్ చేశాడు. తాను నెగిటివ్ చేసినా అటెన్షన్ వస్తుందనే అభిప్రాయంతో వున్నావని నాకు అనిపించింది అని శివాజీ పేర్కొన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments