వేణ్నీళ్ల స్నానంతో కరోనా రాదా?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ఎప్పుడైతే ప్రారంభమైతే అప్పటి నుంచి నివారణోపాయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో నివారణోపాయాన్ని చెబుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టి వేస్తున్నారు. కొన్ని సార్లు అవి ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. ఇటీవల ముక్కులో నిమ్మకాయ రసం వేసుకుంటే కరోనా రాదంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసిన ఓ ఉపాధ్యాయుడు ముక్కులో నిమ్మరసం వేసుకుని మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంది.
Also Read: ఇకపై మీటర్ రీడింగ్ మనమే తీసుకోవచ్చు..
ఇలా ఎన్నో నివారణోపాయాలు ప్రజలను చావు అంచులకు నెట్టేస్తున్నాయి. కాగా.. కొన్ని మాత్రం ఉపయోగకరమైనవనే చెప్పాలి. తాజాగా కరోనా నివారణకు సంబంధించి మరో నివారణ మంత్రం వైరల్ అవుతోంది. అయితే దీని వల్ల ప్రాణాలకు వచ్చే ప్రమాదమేమీ లేదులెండి. ఎంతో కొంత మేలు జరుగుతుంది. వేడి నీళ్లు తాగడంతో పాటు వేడి నీళ్లతో స్నాయం చేస్తే కరోనా నయమవుతుందని.. దరి చేరదని ప్రచారం వెలుగులోకి వచ్చింది. దీనిపై తాజాగా భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
వేడి నీళ్ల కారణంగా కరోనా చావడమో.. తగ్గడమో జరగదని.. ఇదంతా ఒట్టి పుకారు మాత్రమేనని తేల్చేసింది. ప్రత్యేక పద్ధతుల్లో ప్రయోగశాలల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే వేడి నీళ్లతో స్నానం వల్ల కానీ వేడి నీళ్లు తాగడం వలన కానీ మనకు ఎలాంటి ప్రమాదమూ లేదనేది మాత్రం వాస్తవం. అంతేకాదు.. ఎంతోకొంత మేలైతే జరుగుతుంది. ఒళ్లు నొప్పులు తగ్గడం, కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా వంటి ఉపయోగాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com