శింబు మ‌ద‌ర్ గా న‌టిస్తున్న హాట్ హీరోయిన్..

  • IndiaGlitz, [Tuesday,July 05 2016]

త‌మిళ హీరో శింబు తాజాగా అన్బాన‌వ‌న్ అస‌రాద‌వ‌న్ అదంగాద‌వ‌న్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రిష ఇల్ల‌న్నా న‌య‌న‌తార చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన అధిక్ ర‌విచంద‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో శింబు త్రిపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ సినిమాలో న‌టించే హీరోయిన్స్ ఎవ‌రనేది ఇంకా ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే....శింబు న‌టించే మూడు పాత్ర‌ల్లో న‌డి వ‌య‌సు పాత్ర‌కు జంట‌గా త్రిష‌ను సంప్ర‌దిస్తే నో చెప్పింద‌ట‌.

ఆతర్వాత అందాల తార శ్రియ‌ను సంప్ర‌దిస్తే..ఓకే చెప్పింద‌ట‌. శ్రియ‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న శివాజీ చిత్రంలో న‌టించింది. త‌ర్వాత వ‌డివేలుతో ఓ సాంగ్ లో న‌టించి అజిత్ త‌దిత‌ర హీరోల‌తో న‌టించే అవ‌కాశం కోల్పోయింది. దీంతో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి అనుకుందేమో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. ఈ సినిమాతోనైనా శ్రియ కోలీవుడ్ లో మ‌ళ్లీ అవ‌కాశాలు ద‌క్కించుకుంటుందేమో చూడాలి.