కార్తికేయ సరసన హాట్ బ్యూటీ.. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
మీడియం బడ్జెట్ లో ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తోంది టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్. ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరో కార్తికేయ యువతకు బాగా చేరువయ్యాడు. యువతకు నచ్చేలా ఎమోషనల్, మాస్ యాంగిల్ లో నటించగల సత్తా కార్తికేయకు ఉంది. కార్తికేయ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి.
భారీ చిత్రాలని నిర్మిస్తోన్న యువీ క్రియేషన్స్ బ్యానర్ లో కార్తికేయ తదుపరి చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం యువీ సంస్థ యంగ్ బ్యూటీ రుహానీ శర్మని అప్రోచ్ అయినట్లు సమాచారం. కథ బావుండడం, క్రేజీ కాంబినేషన్, టాప్ ప్రొడక్షన్ హౌస్ కావడంతో రుహాని ఈ ఆఫర్ పట్ల థ్రిల్ ఫీల్ అయ్యిందట. ఈ చిత్రంలో నటించేందుకు రుహాని ఎగ్జైట్ గా ఉన్నట్లు సమాచారం.
పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి డెబ్యూ దర్శకుడు ప్రశాంత్ రూపొందించబోతున్నాడు. ఈ చిత్రం తనకు కమర్షియల్ సక్సెస్ అందించడమే కాక, నటిగా మరో లెవల్ కి చేరుస్తుందని రుహాని విశ్వాసంతో ఉంది.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలిం చిలసౌతో రుహాని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలని, గ్లామర్ రోల్స్ ని రుహాని బ్యాలన్స్ చేస్తోంది. చిలసౌ, హిట్ లాంటి చిత్రాల్లో రుహాని తన పెర్ఫామెన్స్ తో ఫుల్ మార్క్ కొట్టేసింది.
సోషల్ మీడియాలో రుహాని ఇచ్చే గ్లామర్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇక యువీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ తో రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడూ ఇలా మీడియం, చిన్న బడ్జెట్ చిత్రాలని కూడా తన బ్యానర్ లో రూపొందిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments