గోపీచంద్ సరసన హాట్ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. గోపీచంద్, తమన్నా ఇరువురు ఇందులో కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్నారు. తమన్నా ఈ సినిమా కోసం తెలంగాణ యాస ప్రత్యేకంగా నేర్చుకోవడం విశేషం. 'యు టర్న్'లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ ఓ బాలీవుడ్ భామను సంప్రదించారట. ఆమె ఎవరో కాదు.. ఊర్వశి రౌతెలా. బాలీవుడ్ చిత్రాల్లో అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాటు హాటుగానే కనపడుతుంటుంది. ఇప్పుడు ఈమె తెలుగులో నటించడం తొలిసారి అవుతుంది. ఈ విషయంపై త్వరలోనే సమాచారం రానుంది. కరోనా వైరస్ ప్రభావం ముగిసిన తర్వాత ఈ ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com