ఎంతమంది పిల్లలకైనా జన్మనిస్తానంటున్న హాట్ యాంకర్!
Send us your feedback to audioarticles@vaarta.com
అనసూయ భరద్వాజ్.. ఈ పేరు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. సాధారణ అమ్మాయిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంచలనాలు సృష్టించింది. యాంకర్‌గా, నటిగా మరీ ముఖ్యంగా జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంకర్‌గా మారిపోయింది. ఇదే క్రేజ్‌తో స్టార్ హీరోల సినిమాల్లో లక్కీ ఛాన్స్‌లు కొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మదర్స్ డే సందర్భంగా అనసూయ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కుటుంబం గురించి, పెళ్లి, భర్త గురించి ఇలా చాలా విషయాలు ఆమె పంచుకుంది. అంతేకాదు.. కొంచెం ఖాళీ దొరికితే ఆడపిల్లకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నానని.. ఒక్క ఆడపిల్లే ఏంటి.. ఎంత మందికైనా జన్మనివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. అమ్మతనం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక వరమని అనసూయ చెబుతోంది.
ముగ్గురా.. నలుగురా.. అనేది కాదు..!
"ప్రతి సారి మీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు ఇద్దరు అబ్బాయిలు అని చెప్పినప్పుడు ఏదోలా ఉంటుంది. మొదట నేను అబ్బాయినే కావాలనుకున్నాను. ఎందుకంటే మేం ముగ్గురం అమ్మాయిలం కదా.. అని అలా అనుకున్నాను. రెండోసారి అమ్మాయి అని అనుకున్నాను మళ్లీ అబ్బాయి పుట్టాడు. నేను చాలా సందర్భాల్లో అంటుంటాను.. నాకే గానీ కొంచెం టైమ్ దొరికితే కచ్చితంగా ఆడబిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ముగ్గురా.. నలుగురా.. అనేది కాదు.. అదంతా దేవుడి దయ. అమ్మతనం అనేది భగవంతుడి దయ.. వరం. మనకు బిడ్డలు ఉన్నారు గనుక ఆ బాధ మనకు తెలియదు.. కానీ పిల్లలు లేని వారికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మా అమ్మమ్మకు ఎనిమిది మంది పిల్లలు. నాకు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం.. ఇంట్లో కలకల్లాడుతుంటే చాలా బాగుంటుంది" అని అనసూయ చెప్పింది.
అమ్మ కష్టమే నన్ను ఈ స్థితిలో ఉంచింది..!
"నాకు మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ జన్మనివ్వడం.. వాళ్లు పెంచిన పద్ధతులే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. నన్ను బాగా మోరల్స్, ఎథిక్స్‌తో తల్లిదండ్రులు పెంచారు. మా నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కాబట్టి అక్కడికి ఇక్కడి తిరగడమే సరిపోయింది. ఉన్నన్ని రోజులు నాన్న మాతో మంచిగా గడిపారు. మా అమ్మ కూడా మంచి హార్డ్ వర్కర్. అమ్మ కష్టమే నన్ను ఈ స్థితిలో ఉంచింది. దేవుడి దయ వల్ల నాకు మంచి భర్త దొరికాడు. లోన్ తీసుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లయ్యాక అమ్మగారింటి నుంచి మేం ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు" అని హాట్ యాంకర్ అనసూయ చెప్పుకొచ్చింది. మరి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు టైమ్ దొరుకుతుందో..? ఎప్పుడు ఆడబిడ్డకు జన్మనిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout