సమంత మారలేదు...అలాగే ఉంది..!
Send us your feedback to audioarticles@vaarta.com
తన అందం, అభినయంతో ఆకట్టుకుని అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ సమంత. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పటి వరకు ఏ సినిమాకు సైన్ చేయలేదు. దీనికి కారణం నాగచైతన్యను త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. అందుచేతనే సమంత సినిమాలు అంగీకరించడం లేదు అనుకున్నారు. అయితే...ఈరోజు సమంత ట్విట్టర్ లో తను సినిమాలు అంగీకరించకపోవడం పై స్పందిస్తూ...సౌత్ లో హీరోయిన్స్ కు అర్ధవంతమైన పాత్రలు లభించడం ఎంత కష్టమో అర్ధమైంది. నేను సినిమాలు చేయకపోవడానికి గల ఒకే ఒక్క కారణం మంచి పాత్రలు లభించకపోవడమే అని తెలియచేసింది.
అయితే...సమంత సమాధానంతో చాలా మందిలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి..! అవి ఏమిటంటే... ఇప్పటి వరకు అన్నీ మీనింగ్ ఫుల్ సినిమాలే చేసిందా..? మీనింగ్ ఫుల్ సినిమాలే చేసుంటే...సడన్ గా ఇప్పుడు ఎందుకు అలాంటి పాత్రలు రావడం లేదో..అర్ధం కావడం లేదు..! అయినా ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయడం లేదు అని ఎవరైనా సమంతని అడిగి ఉంటే వాళ్లకు డైరెక్ట్ గానే సమాధానం చెప్పచ్చు కదా..! ట్విట్టర్ వేదికగా చెప్పడం ఎందుకో..? ఇలా ఎన్నో ప్రశ్నలు...! సమంత చెప్పినదాంట్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ...సమంత మారలేదు ఇది మాత్రం నిజం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments