జిమ్ లో ఆమె హాట్ నెస్ చూశారా.. భయంకర నిజం చెప్పిన ఐటెం బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆమె వయసు 47 ఏళ్ళు. కానీ ఓ యంగ్ బ్యూటీ తరహాలో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ స్టన్నింగ్ ఐటెం బ్యూటీ మలైకా అరోరా. ఈ వయసులో కూడా తన ఫిజిక్ కాపాడుకోవడం కోసం మైలైకా జిమ్ లో చెమటలు చిందించడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా మలైకా జిమ్ లో కసరత్తులు చేస్తున్న హాట్ పిక్స్ పోస్ట్ చేసింది. మతి పోగొట్టేలా ఉన్న మలైకా బోల్డ్ స్టిల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ వెనుక దాగున్న ఓ భయంకర నిజాన్ని మలైకా నెటిజన్లతో షేర్ చేసుకుంది. మలైకా గత ఏడాది సెప్టెంబర్ 5న కరోనాకు గురైంది. దాదాపు 20 రోజుల పాటు కరోనాతో ఆమె పోరాడిందట. ' నా జీవితంలో ఎప్పుడూ అదృష్టం కలసి రాలేదు. ఎలాంటి విషయంలో అయినా నేను పోరాడుతూనే వచ్చా.
ఇదీ చదవండి: పవన్, అకీరా ఇద్దరూ కలసి.. ఫోటోస్ వైరల్
కరోనా నుంచి కోలుకోవడం సులభం అని చాలా మంది చెప్పారు. కానీ సులభం అనే మాట నా జీవితంలో లేదు. కరోనా సోకినప్పుడు భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నా. కేవలం 2 అడుగులు కూడా నడవలేకపోయేదాన్ని. చివరకు సెప్టెంబర్ 26న నెగటివ్ అని వచ్చింది. కానీ నాలో వీక్ నెస్ అలాగే ఉంది. బహుశా మిగిలిన వారిలా నాకు ఇమ్యూనిటీ లేదేమో.
కరోనా తగ్గాక జిమ్ లో వర్కౌట్ స్టార్ట్ చేసిన తొలి రోజు నరకం కనిపించింది. కొన్ని రోజులపాటు నాలో బలహీనత అలాగే కొనసాగింది. ఎట్టకేలకు నేను పూర్తి ఫిట్ నెస్ సాధించా. మునుపటిలా యాక్టివ్ గా మారా. నెగటివ్ వచ్చాక ఇలా యాక్టివ్ కావడానికి నాకు 32 వారలు పట్టింది అని మలైకా తెలిపింది. జిమ్ లో యాక్టివ్ గా ఉన్న ఫోటోస్ నే నెటిజన్లతో మలైకా పంచుకుంది.
ఇక అర్జున్ కపూర్ తో మలైకా ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్. అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు పొందాక అర్జున్ కపూర్ తో ఆమె సహజీవనం చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments