ప్రభాస్ కోసం ఆసుపత్రి కట్టేస్తున్నారట...

  • IndiaGlitz, [Tuesday,March 31 2020]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ జార్జియాలో పూర్త‌య్యింది. త‌దుప‌రి షెడ్యూల్‌ను ఇట‌లీలో చిత్రీక‌రించాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం ప్ర‌పంచం వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సృష్టిస్తున్న బీభ‌త్సాన్ని గుర్తు పెట్టుకుని యూనిట్ హైద‌రాబాద్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాల‌నుకుంటుంద‌ట‌. అందుకోసం ఇట‌లీలో ఓ హాస్పిట‌ల్లో చిత్రీక‌రించాల్సిన స‌న్నివేశాల కోసం హైద‌రాబాద్‌లోనే అలాంటి సెట్‌ను వేస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించిన రెండు, మూడు సెట్స్ వేశారు. తాజాగా వీటితో పాటు హాస్పిట‌ల్ సెట్ కూడా వేయ‌బోతున్నార‌ని టాక్. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి ముందుగా జాన్ అనే టైటిల్‌ను అనుకున్నారు కానీ.. అదే టైటిల్‌తో సినిమా వ‌చ్చేయ‌డంతో ఓ మైడియ‌ర్‌, రాధేశ్యామ్ అనే టైటిల్స్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని టాక్‌. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుద‌ల చేయాల‌నే ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

More News

సాయిప‌ల్ల‌విని ఫాలో అయిన మిల్కీ బ్యూటీ

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దిహేనేళ్లు అవుతుంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా న‌టించి త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

ఆ క్రెడిట్ ఎన్టీఆర్‌కే దక్క‌నుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నేటి త‌రం హీరోల్లో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకోబోతున్నారు. ఇంత‌కూ ఏమీటా ఘ‌న‌త అనుకునే వివ‌రాల్లోకెళ్తే..

టైమ్ వేస్ట్ చేయ‌కూడ‌ద‌నుకుంటున్న ప్ర‌భాస్ టీమ్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20వ సినిమా బిజీలో ఉన్నారు. రీసెంట్‌గానే అంటే లాక్‌డౌన్ అనౌన్స్‌మెంట్‌కు ముందుగానే చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైద‌రాబాద్ చేరుకుంది.

హీరోయిన్స్ పై బ్రహ్మాజీ ఫైర్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటులు పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ‘మీడియా’కు ఫేస్‌బుక్ భారీ సాయం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తోంది. రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. మరోవైపు మరణాల సంఖ్య.. వీటన్నింటి కంటే కొన్ని రెట్లు ఎక్కువగా అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది.