డిఫరెంట్ హార్రర్ ఎంటర్ టైనర్ 'రాక్షసి' మోషన్ పోస్టర్ లాంచ్

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

హార్రర్‌ నేపథ్యంలో దర్శకుడు పన్నా రాయల్‌ రూపొందించిన 'కాలింగ్‌ బెల్‌' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'రాక్షసి' పేరుతో మరో చిత్రం రూపొందించడం జరిగింది. పూర్ణ ప్రధాన పాత్రలో అభినవ్‌ సర్దార్‌, అభిమన్యు సింగ్‌, గీతాంజలి ముఖ్యపాత్రల్లో డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను జనవరి 6న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో పలువురు సినీ ప్రముఖుల నడుమ ఘనంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చెయ్యగా, 'రాక్షసి' లోగోను ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.సురేష్‌బాబు విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ పూర్ణ, నటులు అభిమన్యు సింగ్‌, అభినవ్‌ సర్దార్‌, నటుడు రవివర్మ, ఫణి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన అశోక్‌ మందా, చిత్ర దర్శకుడు పన్నా రాయల్‌, సినిమాటోగ్రాఫర్‌ కర్ణ పి., సంగీత దర్శకుడు వినోద్‌ యాజమాన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ షాని సాల్మన్‌, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు, బేబి ధన్వి, బేబి కృతిక పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లోహిత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ - ''అవును, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన పూర్ణకి 'రాక్షసి' మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. మోషన్‌ పోస్టర్‌ చాలా బాగుంది. సినిమా దాన్ని మించి వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. టీమ్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.
రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''కాలింగ్‌బెల్‌ మూవీ నుంచి పన్నా నాకు పరిచయం. ఆ సినిమా కంటే ఎన్నో రెట్లు బాగా తీశాడు. ఇలాంటి సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రధానమైంది. వినోద్‌ యాజమాన్య ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. కర్ణగారి ఫోటోగ్రఫీ సినిమాకి చాలా పెద్ద ప్లస్‌ అవుతుంది. అన్ని క్వాలిటీస్‌ వున్న ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.
కె.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''కాలింగ్‌బెల్‌కి సంబంధించి పన్నాతో నాకు అనుబంధం వుంది. ఎంతో టాలెంట్‌ వున్న డైరెక్టర్‌. కాలింగ్‌బెల్‌ కంటే 'రాక్షసి' అన్ని విధాలా మంచి ప్రొడక్ట్‌ అనేది మోషన్‌ పోస్టర్‌ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత పన్నా డైరెక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఈ సినిమా బాగా రావడంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
హీరోయిన్‌ పూర్ణ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాలని దర్శకుడు పన్నా రాయల్‌ చెప్పగానే ముందుగా ఆలోచించాను. అయితే సగం స్క్రిప్ట్‌ వినగానే వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలో నేను రాక్షసి కాదు. పెర్‌ఫార్మెన్స్‌ మంచి స్కోప్‌ వున్న క్యారెక్టర్‌ చేశాను. నా కెరీర్‌లో ఈ సినిమా మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.
నటుడు అభిమన్యు సింగ్‌ మాట్లాడుతూ - ''ఇది నాకు ఒక డిఫరెంట్‌ మూవీ. పన్నాగారు నా క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వున్న ఈ సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్‌ అయి మా అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.
అభినవ్ సర్దార్ మాట్లాడుతూ - ''ఈ సినిమా లో మంచి అవకాశం ఇచ్చిన అశోక్ గారికి, డైరెక్టర్ పన్నాగారికి ధన్యవాదాలు. ఈ సినిమా నటుడుగా నాకు చాలా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ - ''కాలింగ్‌ బెల్‌ మూవీ చేస్తున్న టైమ్‌లోనే దానికి సీక్వెల్‌గా కాలింగ్‌బెల్‌ 2 చెయ్యాలని అనుకున్నాను. అయితే 'రాక్షసి' ఈ కథకు పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని ఫిక్స్‌ చేశాం. 'కాలింగ్‌బెల్‌' కంటే కంటెంట్‌ పరంగా, టెక్నికల్‌గా ఎన్నో రెట్లు క్వాలిటీగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రొడక్ట్‌ ఇంత బాగా రావడానికి మా నిర్మాతల సహకారం ఎంతో వుంది. నేను అనుకున్నది అనుకున్నట్టు తియ్యగలిగాను. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే 'రాక్షసి' తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ షాని సాల్మన్‌ మాట్లాడుతూ - ''సినిమా చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. పన్నాగారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మోషన్‌ పోస్టర్‌ చూసి ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసిన దాని కంటే సినిమా ఇంకా బాగుంటుంది'' అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన అశోక్‌ మందా మాట్లాడుతూ - ''దర్శకుడు పన్నా రాయల్‌ చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. వెంటనే షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని క్వాలిటీగా చేశాం. తప్పకుండా మా చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకం వుంది'' అన్నారు.
పూర్ణ, అభిమన్యుసింగ్‌, అభినవ్‌ సర్ధార్‌, గీతాంజలి, ప థ్వీ, బేబీ ధ్వని, బేబీ క తిక, సమ్మెట గాంధీ, తాగుబోతు రమేష్‌, ప్రభాస్‌ శ్రీను, 'ఈరోజుల్లో' సాయి, షాని సాల్మన్‌, ఫణి, ప్రియ, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: కర్ణ పి., ఎడిటింగ్‌: శ్రీసంతోష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: షాని సాల్మన్‌, నిర్మాతలు: అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నారాయల్‌.

More News

పవన్ డిమాండ్స్ పై స్పందించిన చంద్రబాబు..!

శ్రీకాకుళంలో జిల్లాలో కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

చైతన్య టైటిల్ ఇదేనా....?

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నే పెళ్లాడతా తరహా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఇంట్రస్టింగ్ టైటిల్ రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్...యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అఖిల్ వర్కవుట్స్

అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్కు తొలి సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. అయితే ఏ మాత్రం కంగారు పడకుండా అఖిల్ తన నెక్స్ట్ మూవీకి సమయం తీసుకున్నాడు.

నాకు పోటీ లేనే లేదు - మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.