'హోరా హోరీ' 15నిమిషాలు తగ్గింపు

  • IndiaGlitz, [Monday,September 14 2015]

డి.సురేష్ బాబు సమర్పణలో రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం హోరా హోరీ'. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందింది. చిత్రం', నువ్వు-నేను', జయం' వంటి సూపర్ హిట్ ప్రేమకథలను డైరెక్ట్ చేసిన తేజ చిత్రాన్ని మరో సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 11న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను రాబడుతూ విజయవంతంగా సాగుతుంది.

అయితే సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటంతో సినిమా ఆర్ట్ సినిమాలా అనిపిస్తుందని కొందరు అభిమానులు, ప్రేక్షకులు తెలియజేయడంతో ఇప్పడు చిత్రాన్ని 15 నిమిషాల పాటు ట్రిమ్ చేసి కథలో వేగాన్ని పెంచారు. ఇప్పుడు సినిమా ఫుల్ స్పీడ్ తో కమర్షియల్ పంథాలో ఉంటుందని చిత్రయూనిట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ చిత్రం ట్రిమ్ వెర్షన్ ఈరోజు నుండే అన్నీ థియేటర్స్ లో ప్రదర్శితమవుతుందని కూడా తెలియజేశారు.

More News

టాకీపార్ట్ పూర్తి చేసుకున్న 'గరమ్'

సాయికుమార్ తనయుడు ఆది, ‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా ‘గరమ్’ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. ప్రస్తుతం సినిమా టాకీపార్ట్ ను పూర్తి చేసుకుంది.

సహజీవనంపై కాజల్ నోరు విప్పింది

లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది ఇప్పుడు కామన్ పాయింట్ గా మారిపోయింది. కొందరు మన భారతీయ సంప్రదాయ సంస్కృతులకు అది వ్యతిరేకమంటుంటే, మరి కొందరేమో ఇద్దరు వ్యక్తులకు నచ్చినప్పుడు అందులో ఏం తప్పులేదని అంటున్నారు.

విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

'ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రదు కుళ్ళ’ సినిమా చేస్తున్నాడు.

అల్లు అర‌వింద్ చేతుల మీదుగా శివ‌మ్ ఆడియో రిలీజ్

యంగ్ హీరో రామ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం శివ‌మ్. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టించింది.ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డి తెర‌కెక్కించారు.

క‌మ‌ల్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌స్తుతం చీక‌ట‌రాజ్యం ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసిన రాజేష్‌.ఎం.సెల్వ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.