సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న 'హోరా హోరీ'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది`, అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, నువ్వు నేను`, జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హోరాహోరీ`. దిలీప్,దక్ష హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ `మా నాన్నగారి స్ఫూర్తితో నేను నిర్మాతగా మారాను. వైవిధ్యమైన కథాచిత్రాలను అందించిన మా బ్యానర్ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ తేజ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. దిలీప్, దక్ష చాలా చక్కగా నటించారు. ఇందులో అందరూ కొత్త నటీనటులే నటించారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటీవల కళ్యాణ్ కోడూరిగారు అందించిన ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చిది. కర్ణాటకలో 53రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది. దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరి. తేజ మరోసారి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సినీ పరిశ్రమలో కొంతమంది శ్రెేయోభిలాషులకు సినిమా చూపించాం. సినిమా చాలా బాగా వచ్చిందని ప్రశంసించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments