సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న 'హోరా హోరీ'

  • IndiaGlitz, [Sunday,September 06 2015]

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది', అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, నువ్వు నేను', జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హోరాహోరీ'. దిలీప్,దక్ష హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ 'మా నాన్నగారి స్ఫూర్తితో నేను నిర్మాతగా మారాను. వైవిధ్యమైన కథాచిత్రాలను అందించిన మా బ్యానర్ లో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ తేజ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. దిలీప్, దక్ష చాలా చక్కగా నటించారు. ఇందులో అందరూ కొత్త నటీనటులే నటించారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవల కళ్యాణ్ కోడూరిగారు అందించిన ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చిది. కర్ణాటకలో 53రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరిపాం. సినిమా చాలా బాగా వచ్చింది. దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అవుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరి. తేజ మరోసారి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సినీ పరిశ్రమలో కొంతమంది శ్రెేయోభిలాషులకు సినిమా చూపించాం. సినిమా చాలా బాగా వచ్చిందని ప్రశంసించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

More News

నితిన్ కి తలనొప్పి తెస్తున్న కళ్యాణ్..

‘ఇష్క్’,‘గుండెజారి గల్లంతయ్యిందే’వంటి హిట్స్ తో ట్రాక్ లోకి వచ్చిన నితిన్ ‘చిన్నదాన నీకోసం’ చిత్రంతో ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయాడు.

క్రిస్మస్ కానుకగా గోపీచంద్ , రవికుమార్ చౌదరి చిత్రం

'యజ్ఞం'తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, ఏయస్ రవికుమార్ చౌదర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'కంచె' ఓవర్ సీస్ హక్కులను...

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి

క్లాసిక్ సితార కాదంటున్నారు మరి...

జీనస్ ఫిలింస్ బ్యానర్పై సురేంద్ర జి.ఎల్ దర్శకత్వంలో రవికుమార్ డి.ఎస్. నిర్మించే చిత్రం సితార. రవిబాబు, రవనీత్ కౌర్, సుమన్ ప్రధానపాత్రల్లో నటించారు.

'కృష్ణాష్టమి' టీజర్ రివ్యూ...

కమెడియన్ గా కెరీర్ ను స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న స్టార్ సునీల్.