కలిసి పోటీ చేస్తే మేయర్ వీళ్లకే ఇక నో డౌట్..

  • IndiaGlitz, [Thursday,November 19 2020]

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదలై మూడు రోజులు గడుస్తున్నా.. పార్టీల మధ్య పొత్తుల ప్రస్తావనైతే బుధవారం వరకూ రాలేదు. దీంతో ఏ పార్టీకాపార్టీ విడివిడిగానే బరిలోకి దిగే అవకాశాలున్నట్టు ప్రజలు భావిస్తూ వచ్చారు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు పార్టీలు పొత్తులకు సమాయత్తమవుతున్నాయి. దుబ్బాక ఫలితం రిపీట్ అవ్వాలంటే ఇప్పటి వరకూ పొత్తులు అవసరమేనని పార్టీలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, జనసేనలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని జనసేన, బీజేపీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కలవనున్నారు. ఈ నిర్ణయంతో ఇరు పార్టీల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటాయనే చర్చ నడుస్తోంది. కలిసి పోటీ చేస్తే బీజేపీ, జనసేనలకే మేయర్ పీఠం దక్కుతుందని.. నో డౌట్ అని ఇరు పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు. జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉండదని అది తమకు ఎంతగానో లాభిస్తుందని.. టీఆర్ఎస్‌ను దెబ్బ తీసేందుకు చాలా బాగా సహకరిస్తుందని ఇరు పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో బీజేపీ, జనసేనల పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More News

ఎంఐఎం అభ్యర్థులను ఓడిస్తాం: కేటీఆర్

ఎవరైనా రాజీనామాకు సవాల్ చేస్తే తాను స్పందిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బల్దియాపై మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామని..

హీట్ పెంచుతున్న గ్రేటర్.. తొలిరోజు 20 నామినేషన్లు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.

వరవరరావును తక్షణమే నానావతి ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు

విరసం నేత, హక్కుల కార్యకర్త వరవరరావును తక్షణమే జైలు నుంచి నానావతి ఆసుపత్రికి తరలించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తారక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అదేంటి? తారక్‌ ట్రిపుల్‌ ఆర్ సినిమా షూటింగ్‌లో లేడా? అనే సందేహం రాకమానదు.

'ఆదిపురుష్‌' నుండి మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

రెబెల్ స్టార్ కృష్ణంరాజు వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.