ప్రభాస్ సినిమాలో హాలీవుడ్ టెక్నిషియన్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి2 సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. డిసెంబర్ రెండో వారంతో సినిమా చిత్రీకరణ ముగియగానే ప్రభాస్ తన నెక్ట్స్ సినిమాను వీలైనంత తర్వగా సెట్స్‌లోకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను రూపొందించనుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు ఆ ఫేమ్‌ను వాడుకోనున్నారు. ప్రభాస్ తదుపరి చిత్రం వందకోట్ల పై బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాను మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ఎమీజాక్సన్ హీరోయిన్‌గా నటించనుంది. కాగా లెటెస్ట్ సమాచారం ప్రకారం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బ్యాట్స్ ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేయనున్నాడట. ప్రస్తుతం అందరి కన్నుఏప్రిల్ 28న విడుదల కానున్న ప్రభాస్ బాహుబలి 2పైనే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments