నాగ్ స్టంట్స్‌ కోసం హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్ వచ్చాడు!

  • IndiaGlitz, [Sunday,December 29 2019]

టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ టైటిల్ ఖారరైంది. ‘వైల్డ్ డాగ్’ అనే ఆసక్తికరమైన పేరును పెట్టారు. కొత్తదనాన్ని పరిచయడంలో ముందుండే నాగ్.. ఈసారి ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నాగ్ నటిస్తున్నారు. సాల్మన్ డైరెక్షన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్.. హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు పనిచేసిన డేవిడ్ స్మాలోన్ పని చేస్తున్నారట. ప్రస్తుతానికి ఆయన యాక్షన్ సీక్వెన్సెన్స్ డైరెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ చేయాలన్న ఆలోచనల్లో చిత్ర నిర్మాతలు ఉన్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

2009 నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో నాగార్జున ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టు విజ‌య్ వ‌ర్మగా న‌టిస్తున్నారు. అత్యంత వాస్తవికంగా సినిమాను రూపొందించడానికి సాల్మ‌న్ ప్రయత్నిస్తున్నాడు.