చిరు కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్

  • IndiaGlitz, [Thursday,August 24 2017]

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. దాదాపు రెండు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార వంటి స్టార్స్ ఇందులో క‌నిపించ‌నున్నారు. హిస్టారిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్క‌నున్న ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ ప్ర‌ధానంగా హైలైట్ అవుతాయ‌న‌డంలో సందేహం లేదు. అందుకోసం హాలీవుడ్ యాక్ష‌న్ మాస్ట‌ర్‌ను ఈ సినిమా కోసం వినియోగిస్తున్నార‌ట‌. స్పైడ‌ర్ మేన్ చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న టోనీ చింగ్ ఈ సినిమాలో యాక్ష‌న్స్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తార‌ని స‌మాచారం.

More News

కీర్తి సురేష్ కి ఇది మూడోసారి

కీర్తి సురేష్ అనగానే ఠక్కున గుర్తొచ్చే చిత్రం 'నేను శైలజ'.

బాలకృష్ణ 'పైసావసూల్ ' తో చిన్న సినిమా పోటీ

విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం 'వెళ్లిపోమాకే'.సుప్రజ,శ్వేత నాయికలు.యాకూబ్ అలీ దర్శకత్వం వహించారు.

పవన్ బాటలో అప్పుడు బన్నీ..ఇప్పుడు సాయి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన చిత్రం తొలి ప్రేమ.

జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా - మనోజ్

నేను మీకు తెలుసా సినిమాను తమిళంలో నాన్ ఉనకు తెరియుమా సినిమాతో

శర్వానంద్ కి కూడా అదే ఫార్ములా..

యూత్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మారుతి. ఈరోజుల్లో, బస్స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మారుతికి.. అతని గత చిత్రం బాబు బంగారం ఆశించిన విజయం అందించలేక పోయింది.