చిరు కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత. దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. సినిమా చిత్రీకరణకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ ఇందులో కీలకపాత్రలో నటిస్తుండగా కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార వంటి స్టార్స్ ఇందులో కనిపించనున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రధానంగా హైలైట్ అవుతాయనడంలో సందేహం లేదు. అందుకోసం హాలీవుడ్ యాక్షన్ మాస్టర్‌ను ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారట. స్పైడర్ మేన్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న టోనీ చింగ్ ఈ సినిమాలో యాక్షన్స్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments