Hollywood:హాలీవుడ్‌లో సమ్మె సైరన్.. మూతపడిన ఇండస్ట్రీ, 63 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్ట్రైక్

  • IndiaGlitz, [Friday,July 14 2023]

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తోంది. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి నేర్చుకునేలోగా, మరొకటి పుట్టుకొస్తోంది. ఇక ఇటీవల రంగ ప్రవేశం సృష్టించిన అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని గేమ్ ఛేంజర్‌‌గా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ ప్రపంచంతో మనం జీవించే , పనిచేసే, సంభాషించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కత్తికి రెండు వైపులా పదును వున్నట్లుగా .. దాని వల్ల నష్టాలు కూడా వుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషిని మించి ఆలోచించే ఈ సాంకేతిక ఏ రోజుకైనా మానవాళికి ముప్పేనంటున్నారు.

ఏఐ ముప్పు, వేతనాలు పెంపు కోరుతూ సమ్మె :

తాజాగా ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏఐ కారణంగా సమ్మె సైరన్ మోగింది. 63 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా నటీనటులు, రచయితలు సమ్మె చేపడుతూ వుండటంతో హాలీవుడ్‌లోని అన్ని విభాగాలు నిలిచిపోయాయి. కృత్రిమ మేథ నుంచి పొంచివున్న ముప్పు, తక్కువ వేతనాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అని విభాగాలకు చెందిన కార్మికులు సమ్మకు దిగారు. ప్రొడక్షన్ హౌస్‌లతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో స్క్రిన్ యాక్టర్స్ గిల్డ్ ఈ సమ్మె నిర్వహిస్తోంది. ఈ గిల్డ్‌లో 1,60,000 మంది నటీనటులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌ షూటింగ్‌లు వాయిదాపడ్డాయి. అన్నట్లు ఈ స్క్రిన్ యాక్టర్స్ గిల్డ్‌లో ట్రామ్ క్రూజ్, ఏంజెలినా జోలీ, జానీ డెప్ , మెరిల్ స్ట్రీప్, బెన్ స్టిల్లర్, కోలిన్ ఫారెల్ తదితరులు సభ్యులుగా వున్నారు. గత వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

1960లో చివరిసారిగా సమ్మె :

హాలీవుడ్‌లో చివరిసారిగా 1960లో సమ్మె జరిగింది. అప్పటి సూపర్‌స్టార్, అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలోని రెండు సంఘలు సమ్మె నిర్వహించాయి. 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె నిర్వహించారు. ఇన్నేళ్ల తర్వాత రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కలిసి సమ్మెకు దిగడంతో హాలీవుడ్ మూతపడినట్లయ్యింది.

More News

PM Narendra Modi:ఫ్రాన్స్‌లో మన యూపీఐ సేవలు .. ఈఫిల్ టవర్ వద్ద ప్రారంభం : శుభవార్త చెప్పిన మోడీ

నోట్ట రద్దు సమయంలో మనదేశంలో అందుబాటులోకి వచ్చిన యునిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.

Mayabazaar For Sale:ఈ వెబ్ సిరీస్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.. ‘మాయాబజార్ ఫర్ సేల్’ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవదీప్

వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే

ISRO:ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాలు.. నేడే చంద్రయాన్ - 3 , సర్వం సిద్ధం చేసిన ఇస్రో

అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది.

Pawan Kalyan:జగన్ రౌడీ పిల్లాడు .. జగ్గూభాయ్‌‌కి భయపడొద్దు, నేను హ్యాండిల్ చేస్తా : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వాలంటీర్ వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్టీ నేతలతో

YS Jagan:ఏ సర్వే అయినా రిజల్ట్ ఒక్కటే .. జగన్‌కే పట్టాభిషేకం,  పోల్ స్ట్రాటజీ సంస్థది అదే మాట..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.