సూపర్‌స్టార్‌తో నటించాలనుందంటున్న హాలీవుడ్ యాక్టర్
- IndiaGlitz, [Friday,June 14 2019]
ఇటీవల మహర్షి విడుదలైనప్పుడు ఆ సినిమాను ఆకాశానికెత్తేస్తూ.. మహేష్, వంశీ పైడిపల్లి అమెరికా వస్తే తనను కలవాలంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు హాలీవుడ్ యాక్టర్ బిల్ డ్యూక్. ఈయన ఇప్పుడు మరో కోరికను వ్యక్తం చేశారు. తన కోరిక వ్యక్తం చేస్తూ మురుగదాస్, రజనీకాంత్‌లకు ఆయన ట్వీట్ పెట్టారు.
'మురుగదాస్‌గారు మీ దర్బార్ చిత్రంలో రజనీకాంత్ సోదరుడిగానైనా, నయనతార అంకుల్‌గానైనా నటించాలని ఉంది. అలాగే అనిరుధ్ మాలాంటి స్టార్స్ కోసం ఓ సాంగ్‌ను కంపోజ్ చేస్తే బావుంటుంది' అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. దీనికి 'సార్! నిజంగా మీరేనా?' అంటూ మురుగదాస్ ఆయనకు రిప్లయ్ ఇచ్చారు. మరి హాలీవుడ్ యాక్టర్ కోరికను మురుగదాస్ తీరుస్తాడో లేదో చూడాలి.