'హితుడు' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,December 11 2015]

నాయ‌కుడి నుండి ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌కు మారిన జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం హితుడు. మ‌న చుట్టూ ఉన్న స‌మాజం గురించి ఆలోచించాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్ర‌మే హితుడు. మ‌రి ఇందులో జ‌గ‌ప‌తిబాబు ఎలాంటి హితాన్ని చెప్పాడో తెలుసుకోవాలంటే స‌మీక్ష‌లోకి వెళ‌దాం.
క‌థ‌-

నాగ‌రాజు ఓ మురికివాడ‌లో నివ‌సిస్తుంటాడు. ఇంట‌ర్‌లో బాగా చ‌దివిన అత‌నికి స్టేట్ ర్యాంక్ వ‌స్తుంది. దాంతో కార్పొరేట్ కాలేజ్‌లు అత‌ను త‌మ కాలేజ్‌లో చ‌దివిన‌ట్టుగా చెబితే డ‌బ్బు ఇస్తామంటారు. కానీ నాగ‌రాజు తండ్రి నాగ‌రాజును చ‌దివించిన అభిలాషను స‌ల‌హా అడ‌గాల‌ని అంటాడు. అభిలాష‌(మీరానంద‌న్‌) ఓ డాక్ట‌ర్‌. త‌న‌కి భ‌ర్త, ఇద్ద‌రు పిల్ల‌లుంటారు. నాగరాజు కూడా కార్పొరేట్ కాలేజ్ ఇచ్చే డబ్బు గురించి ఆలోచిస్తే త‌ను చ‌దువుకున్న‌ది సీతారాం ఫౌండేష‌న్ స‌హాయంతో అని, అస‌లు సీతారాం ఎవ‌రో క‌థ‌ను చెప్ప‌డం ప్రారంబిస్తుంది అభిలాష‌. విశాఖ‌లోని ఎజెన్సీ ప్రాంతంలో అభిలాష, అబ్బులు అనే పేరుతో పెరుగుతుంటుంది. అక్క‌డికి వ‌చ్చే ల‌క్ష్మ‌ణ్ణ ద‌ళంలోని సీతారాం (జ‌గ‌ప‌తిబాబు)కు అక్క‌డి ప్ర‌జ‌లు స్థితిగ‌తుల‌కు వారికి చ‌దువు లేక‌పోవ‌డ‌మేనని గ్ర‌హించి వారికి అక్క‌డ సుబ్ర‌మ‌ణ్యం మాస్ట‌ర్ స‌హాయంతో చ‌దువు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్క‌డే సీతారాంకు అబ్బుల ప‌రిచ‌యం అవుతుంది. ఆమెకు అభిలాష అనే పేరు పెట్టి చ‌దువు చెప్ప‌డం ప్రారంభిస్తాడు. అలాంటి త‌రుణంలో అనుకోకుండా అక్క‌డి ముస‌లి షావుకారు ముత్యాల రావుతో అభిలాష త‌ల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి చేస్తారు. పెళ్ళి ఇష్టం లేని అభిలాష పారిపోయి సీతారం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తుంది. అప్పుడు సీతారాం ఏం చేస్తాడు? అభిలాష‌కు ఏం దారి చూపిస్తాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
స‌మీక్ష‌-

జ‌గ‌ప‌తిబాబు లాంటి సీనియ‌ర్ యాక్ట‌ర్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. ఎక్క‌డా ఓవ‌ర్ ఎమోష‌న్స్ క‌న‌ప‌ర‌చ‌లేదు. అలాగే బెన‌ర్జి స‌హా మిగిలిన పాత్ర‌ధారులంతా వారి పాత్రల‌కు న్యాయం చేశారు. నిజం చెప్పాలంటే ద‌ర్శ‌కుడు విప్ల‌వ్ చెప్పాల‌నుకున్న విష‌యం బావుంది. కానీ సినిమాని న‌డిపించిన తీరు ఆక‌ట్టుకోదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ ఎంట‌ర్‌టైనింగ్ ప‌ర్సంటేజ్ సినిమాల వైపు పరుగు తీస్తుంది. ఇలాంటి త‌రుణంలో ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని బోర్ కొట్టించ‌కుండా న‌డిపించ‌డ‌మే. కానీ ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలో పెయిల‌య్యాడు. సినిమా ర‌న్నింగ్ స్ట‌యిల్ చూస్తే ఆర్ట్ ఫిలిం చూస్తున్న‌ట్టే ఉంటుంది. భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమాకు ప్రెష్ నెస్ తీసుకొచ్చింది. కోటి సంగీతం కూడా ప‌రావాలేదు. మీరానంద‌న్‌ను ద‌ర్శ‌కుడు ప్రెజంట్ చేసిన తీరు బావుంది. న‌క్స‌లైట్స్ సంచ‌రిస్తుంటారు కానీ పోలీసుల అన్న‌ల గురించి ఏమీ ప‌ట్ట‌న‌ట్లు ఉండ‌టం ఆశ్చర్యాన్ని తెస్తుంది. ఎక్క‌డా వ‌ల్గారిటీకి తావు లేకుండా సినిమాను తెర‌కెక్కించారు. పాట‌లు కూడా పాడుకునేలా లేవు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
బాట‌మ్ లైన్‌-

ప్ర‌తి ఒక్క‌రికి స‌మాజం ప‌ట్ల బాధ్య‌త ఉంటుంద‌ని చెప్పాల‌నుకున్న థీమ్ మంచిదే కానీ ప్ర‌య‌త్న‌మే ఆక‌ట్టుకోలేదు. హితుడు ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.

రేటింగ్ - 2/5

More News

రాశి ఈజ్ బ్యాక్

సీనియర్ హీరోయిన్ రాశి ఇప్పుడు మళ్ళీ తెరపై కనిపించబోతుంది.దాదాపు 12 ఏళ్ళ తర్వాత రాశి సినిమాలో కనిపించనుండటం విశేషం.

సెంటిమెంట్ ఫాలో అవుతున్న మారుతి...

ఈరోజుల్లో...అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించి ఇండస్ట్రీ ద్రుష్టిని తన వైపుకి తిప్పుకున్న యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి.

విష్ణు హీరోయిన్ మారిపోయింది...

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

చండియాగంలో చరణ్ దంపతులు...

తన నెక్ట్స్ సినిమాకు గ్యాప్ దొరకడంతో విదేశాలకు వెళ్ళిన చరణ్ అక్కడ నుండి కూడా వచ్చేశాడు.

బాలయ్యతో ఆ హీరోయిన్..?

ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తుంది.అదే నందమూరి బాలకృష్ణ సరసన తమిళ హీరోయిన్ నయనతార నటించనుందని.