మాఫియా నేపధ్యంలో 'హైటెక్ కిల్లర్'
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ "మిస్టర్ ఆంధ్ర" బల్వాన్ హీరోగా మౌనిక హీరోయినిగా వి వి వి దర్శకత్వంలో సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ త్రిల్లర్ చిత్రం "హైటెక్ కిల్లర్ " మాఫియా గ్యాంగ్ ఏ దేశంలో ఉన్నా.. హైదరాబాద్ అడ్డాగా మారింది .దీనిని ఆధారం గా తీసుకుని ఈ చిత్రం రూపొందించబడింది .
చిత్రనిర్మాతమజ్నుసోహ్రాబ్ మాటలాడుతూ.... ప్యాచ్ వర్కు మినహా టాకీను పూర్తిచేసుకున్న ఈ చిత్రం లో మూడు ఫైట్లు,ఆరు పాటలున్నాయి .సంగీత దర్శకుడు యస్. కె. మజ్ను స్వరపరచిన పాటల బాణీలు శ్రోతలను అలరిస్తాయని,డాన్స్ మాస్టర్ నేతృత్వంలో ఐదు రాత్రుళ్ళు తీసిన ఓ రేయి న్ సాంగ్ చిత్రం లో హైలెట్ గా నిలుస్తుందని . దసరాకు ఆడియో పాటలను, డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
సహా నిర్మాత ,యమ్. భాగ్యలక్ష్మి మాటలాడుతూ.... ఇటీవల కాలంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతో చిత్రీకరించాం ఆ బాల గోపాలాన్ని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.
ఇంకా ఈ చిత్రంలో సత్య ప్రకాష్ ,చందు, అన్నపూర్ణ మ్మ , గౌతమ్ రాజు,ప్రసన్న కుమార్,పావలా శ్యామల, దిల్ రమేష్, మిమిక్రీ మూర్తి,సంపత్ రాజ్,శివ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:యాదగిరి,ఫైట్స్:అవినాష్. డాన్స్ : బ్రదర్ ఆనంద్ నిర్మాతలు: మజ్ను సోహ్రాబ్, యమ్. భాగ్యలక్ష్మి . కథ, మాటలు,పాటలు,స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఆర్ట్ ,సంగీతం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎస్. కె మజ్ను దర్శకత్వం :వి వి వి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments