మాఫియా నేపధ్యంలో 'హైటెక్ కిల్లర్'

  • IndiaGlitz, [Friday,August 18 2017]

మాజీ "మిస్టర్ ఆంధ్ర" బల్వాన్ హీరోగా మౌనిక హీరోయినిగా వి వి వి దర్శకత్వంలో సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ త్రిల్లర్ చిత్రం "హైటెక్ కిల్లర్ " మాఫియా గ్యాంగ్ ఏ దేశంలో ఉన్నా.. హైదరాబాద్ అడ్డాగా మారింది .దీనిని ఆధారం గా తీసుకుని ఈ చిత్రం రూపొందించబడింది .

చిత్రనిర్మాతమజ్నుసోహ్రాబ్ మాటలాడుతూ.... ప్యాచ్ వర్కు మినహా టాకీను పూర్తిచేసుకున్న ఈ చిత్రం లో మూడు ఫైట్లు,ఆరు పాటలున్నాయి .సంగీత దర్శకుడు యస్. కె. మజ్ను స్వరపరచిన పాటల బాణీలు శ్రోతలను అలరిస్తాయని,డాన్స్ మాస్టర్ నేతృత్వంలో ఐదు రాత్రుళ్ళు తీసిన ఓ రేయి న్ సాంగ్ చిత్రం లో హైలెట్ గా నిలుస్తుందని . దసరాకు ఆడియో పాటలను, డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తామని అన్నారు.

సహా నిర్మాత ,యమ్. భాగ్యలక్ష్మి మాటలాడుతూ.... ఇటీవల కాలంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా కొన్ని కల్పిత పాత్రలతో చిత్రీకరించాం ఆ బాల గోపాలాన్ని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.

ఇంకా ఈ చిత్రంలో సత్య ప్రకాష్ ,చందు, అన్నపూర్ణ మ్మ , గౌతమ్ రాజు,ప్రసన్న కుమార్,పావలా శ్యామల, దిల్ రమేష్, మిమిక్రీ మూర్తి,సంపత్ రాజ్,శివ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:యాదగిరి,ఫైట్స్:అవినాష్. డాన్స్ : బ్రదర్ ఆనంద్ నిర్మాతలు: మజ్ను సోహ్రాబ్, యమ్. భాగ్యలక్ష్మి . కథ, మాటలు,పాటలు,స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఆర్ట్ ,సంగీతం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎస్. కె మజ్ను దర్శకత్వం :వి వి వి

More News

పవన్ కళ్యాణ్ పాటను ఆవిష్కరించిన మా అధ్యక్షులు శివాజీరాజా

'మొగుడ్స్ పెళ్లామ్స్' 'దొంగోడి పెళ్లి' చిత్రాల సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ స్వతహాగా పవన్ కళ్యాణ్ కి అభిమాని.

అత్యంత వైభవంగా జరిగిన డా. యం.యస్.జి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 50వ జన్మదిన వేడుకలు

యం.యస్.జి మూవీ ఫేమ్ సంత్ గుర్మీత్ రామ్ రహీమ్ 50వ జన్మదిన వేడుకలు హర్యానా రాష్ట్రం,

చిరు తరువాత 20 ఏళ్లకి..

మెగాస్టార్ చిరంజీవిలో ఓ మంచి సింగర్ దాగున్నాడన్న విషయం మాస్టర్(1997)సినిమా ఆడియో రిలీజ్ అయ్యే వరకు తెలియదు.

ఆమెకి చైతు అయినా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడా?

80వ దశకం చివరిలోనూ,90వ దశకం ఆరంభంలోనూ బలమైన కథానాయిక పాత్ర ఏదైనా ఉందంటే..

వాటినే టార్గెట్ చేసుకుంటున్న పవన్

సినిమా సక్సెస్ కావడానికి సీజన్ తో పని లేదన్నది పాత మాట.