చైనాలో ఆద‌ర‌ణ పొందుతున్న‌'హిచ్‌కీ'

  • IndiaGlitz, [Friday,October 26 2018]

పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న హీరోయిన్ రాణి ముఖ‌ర్జీ న‌టించిన చిత్రం 'హిచ్ కీ'. ఈ ఏడాది మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్నే సొంతం చేసుకుంది. టీచ‌ర్ కావాల‌నుకునే ఓ మ‌హిళకు వింత శ‌బ్దాలు చేసే మాన‌సిక స‌మ‌స్య ఉంటుంది.

ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించి ఆ మ‌హిళ టీచ‌ర్ ఎలా అయ్యింద‌నే క‌థ‌తో ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో కూడా విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందుతుంద‌ట‌. చైనాలో కూడా వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సినిమా సాధించింద‌ని రాణి ముఖ‌ర్జీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. కంటెంట్ ఉన్న సినిమాల‌కు ప్రాంతం, భాష‌తో సంబంధం ఉండ‌ద‌ని 'హిచ్‌కీ' నిరూపించింద‌ని రాణీముఖర్జీ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

More News

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా తొలి చిత్రం

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు.

సూర్య 'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్‌

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

బన్నితదుప‌రి డేట్ ఫిక్స్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ దర్శ‌క‌త్వంలో సినిమా రానుండ‌టం దాదాపు క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం త‌ర్వాత బ‌న్ని మ‌రో సినిమాను చేయ‌లేదు.

హిందీలో టైటిల్ మారింది ఎందుకో...?

సాధార‌ణంగా సినిమాల‌కు టైటిల్స్ విష‌యంలో ఏదైనా పేచీ ఉంటే మార్పు ఉండ‌టం కామ‌న్‌గా జ‌రుగుతుంటుంది.

రూల్ పాటలను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు

శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై శివ సోనా పటేల్ హీరో హీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్య నారాయణ నిర్మిస్తున్న చిత్రం రూల్