కరోనాపై పోరులో 'హిట్' అవ్వాలంటే...

  • IndiaGlitz, [Thursday,April 16 2020]

లాక్‌డౌన్ వల్ల బయటకు వెళ్లకూడదని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో బయట అడుగుపెట్టక తప్పదు. మందుల కోసమో, నిత్యావసర సరుకుల కోసమో బయటకు వెళ్లవలసిన పరిస్థితి. అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని యువ దర్శకుడు శైలేష్ కొలను వీడియో చేసి మరీ చూపించారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ సినిమా 'హిట్: ది ఫస్ట్ కేస్'తో దర్శకుడిగా శైలేష్ పరిచయం అయ్యారు. కరోనాపై పోరులో 'హిట్' అవ్వాలంటే ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తే మంచిదని వీడియో చూసినవారు ప్రశంసిస్తున్నారు.
 

కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ తరుణంలో, మహమ్మారి మన దరికి చేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శైలేష్ కొలను మాట్లాడుతూ లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకూ పొడిగించడంతో మనకు ఇంకొన్ని రోజులు ఇబ్బంది తప్పదు. ఈ సమయంలో సరుకులు, మందులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? అనేది మనమంతా తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. నేను దర్శకుడు కావడానికి ముందు, హెల్త్ కేర్ ప్రాక్టీషనర్‌ని. డిసీజ్ కంట్రోల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల... నేను బయటకు వెళుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది చూపిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశా అని అన్నారు.

More News

సురభి గ్రూప్‌కు సాయం చేసి పెద్ద మనసు చాటుకోండి!

చరిత్రను చూపి సమాజంలో జరిగే మంచి చెడులను తెలిపేది ‘నాటకం’ అనే విషయం అందరికీ తెలిసిందే. కాయాకష్టం చేసి అలసి సొలసి పోయిన శ్రమజీవికి ఉపశమనం కల్పించేదీ నాటకమే.

కరోనా భయం: ఫ్రెండ్ దగ్గుతున్నాడని కాల్చేశాడు..!

రోనా.. కరోనా.. ఉదయం నిద్రలేచింది మొదలుకుని మళ్లీ నిద్రపోయే వరకూ ఆ మహమ్మారి భయమే. ఎవరు దగ్గుతున్నా.. తుమ్ముతున్నా వారిపై అనుమానమే.

మాజీ ల‌వ‌ర్ పేరుని చెరిపేసిన న‌య‌న‌తార‌

ద‌క్షిణాది హీరోయిన్స్‌లో న‌య‌న‌తార‌కు ఉన్న క్రేజే వేరు. మూడు నాలుగు కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డ‌మే కాదు. సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రాన‌ని ముందే చెప్పేస్తుంది.

‘ఆచార్య‌’లో చిరు పాత్ర ఎలా ఉంటుందంటే..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌

ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేస్తాం: కేసీఆర్

తెలంగాణలో ఎంతమందికైనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం