చరిత్రే నిర్ణయిస్తుంది.. పట్టుదల.. మూర్ఖత్వమా?
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ముఖ్యమంత్రి జీవిత చరిత్రలో పాదయాత్ర ఘటాన్ని ఆధారంగా చేసుకుని యాత్ర అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో శశిదేవి రెడ్డి, విజయ్ చల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. "తెలుసుకోవాలని ఉంది... వినాలని ఉంది... ఈ గడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది... వారితో కలిసి నడవాలని ఉంది... వారి గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు.. ఓడితే మూర్ఖత్వం అంటారు.
పాదయాత్ర మూర్ఖత్వమో లేక పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది" అంటూ టీజర్‌ను చక్కగా కట్ చేశారు. వై.ఎస్.ఆర్ లుక్‌లో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఒదిగిపోయినట్లు కనపడుతుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com