Download App

Hippi Review

కార్తికేయ.. ఈ మధ్య యూత్‌ హీరోల్లో ప్రముఖంగా వినపడ్డ పేరు. గత ఏడాది విడుదలైన 'ఆర్‌.ఎక్స్‌ 100'తో ఈ యువ కథానాయకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ హీరోతో సినిమా చేయడానికి అప్పట్లో మంచి క్రేజ్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే తెలుగు నిర్మాతలతో కాకుండా తమిళ సీనియర్‌నిర్మాత కలైపులిథాను దర్శకత్వంలో సినిమాను అనౌన్స్‌ చేశాడు కార్తికేయ. తొలి సినిమాకు భిన్నంగా 'హిప్పీ' లవర్‌బోయ్‌ రోల్‌ చేశాడని టీజర్‌, ట్రైలర్‌ చూసిన వారికి అర్థమైంది. మరి కార్తికేయకు 'హిప్పీ' సినిమాతో సక్సెస్‌ దక్కిందా? లేదా? అనే విషయం తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం ముందు...

కథ:

హిప్పీ(కార్తికేయ) జీవితంలో అప్పటి వరకు తనకు తోచినట్లుగా సంతోషంగా ఉంటాడు. స్నేహ(జెజ్‌బా సింగ్‌) హిప్పీతో ప్రేమలో ఉంటుంది. కిక్‌ బాక్సర్‌ అయిన హిప్పీ గోవా వెళ్లే దారిలో ఆముక్త మాల్యదను చూసి ప్రేమిస్తాడు. చివరకు స్నేహను కాదని ఆముక్తపైనే తనకు ప్రేమ ఉందని తెలుసుకుని, ఆమెకు తన ప్రేమను చెబుతాడు. ముందు కాదని అనుకున్నా.. తర్వాత ఆముక్త కూడా హిప్పీని ప్రేమిస్తుంది. అందరి ప్రేమికులులాగానే హిప్పీని కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకుంటుంది. అయితే ఆమె ప్రేమను ఇబ్బందిగా భావించి వదిలించుకోవాలనుకుంటాడు హిప్పీ. కానీ ఆమె వదులుకోలేదు. చివరకు కొన్ని పరిస్థితుల్లో ఇద్దరూ విడిపోతారు. హిప్పీ బాస్‌(జె.డి.చక్రవర్తి)ని ఆముక్త పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇంతకు ఆమె ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? హిప్పీ, ఆముక్త మధ్య ఎలాంటి ప్రేమ లేదని ప్రూవ్‌ చేయడానికి హిప్పీ బాస్‌ ఓ టెస్ట్‌ పెడతాడు. ఇంతకు ఆయన పెట్టే టెస్ట్‌ ఏంటి? ప్రేమికులు కలుసుకున్నారా? విడిపోయారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ:

ప్రేమ కథాచిత్రాలన్న తర్వాత ఇద్దరు ప్రేమికులు విడిపోవడం, కలుసుకోవడం కామన్‌గా జరిగే విషయాలే. అయితే సన్నివేశాలను ఎంత కొత్తగా తెరకెక్కించాం అనే దాన్ని బట్టే సినిమా ప్రేక్షకుల రీచింగ్‌ ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ పెద్దగా చేసిందేమీ లేదు. హీరో సూసైడ్‌తో స్టార్ట్‌ అయ్యే సినిమా అతని ప్రేమ, గొడవలతోనే ఫస్టాఫ్‌ అంతా సరిపుచ్చేశాడు. ఇక సెకండాఫ్‌ విషయానికి వచ్చేసరికి అదే గొడవలను కంటిన్యూ చేస్తూ చూపించాడు. ఇక హీరో, హీరోయిన్స్‌ విడిపోవడం, పెళ్లి, ఒక రూంలో ఉండి గొడవపడటం, హీరో హీరోయిన్స్‌ మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలన్నీ సెకండాఫ్‌లో ఉంటాయి. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌ బాగానే ఉంది. నివాస్‌ సంగీత, నేపథ్యం సంగీతం బాగాలేదు. ఆర్‌.డి.రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే కార్తికేయ తన గత చిత్రంతో పోల్చితే కొత్త పాత్రనే చేశాడనాలి. ఎక్కువ లిప్‌లాక్స్‌ ఎక్కడా కనపడవు. రొమాంటిక్‌ సీన్స్‌అన్నీ సెకండాఫ్‌ క్లైమాక్స్‌ ముందునే ఉంటాయి. హీరో కార్తికేయ పాత్ర పరిధి మేర చక్కగా నటించాడు హీరోయిన్‌ దిగంగన సూర్య వన్షీ చక్కటి నటన ప్రదర్శించింది. పాత్ర పరంగా నటననే కాదు.. రొమాంటిక్‌ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించింది. కీలకమైన పాత్రలో జెడి.చక్రవర్తి సునాయసంగా నటించేశాడు. తెలంగాణ స్లాంగ్‌లో నేటి యూత్‌ లవ్‌కు కనెక్ట్‌ అయ్యేలా డైలాగ్స్‌ను పలికించారు. జెజ్‌బా సింగ్‌ పాత్ర చాలా పరిమితం. ఈమె పాత్ర గురించి పెద్దగా చెప్పుకునేంత ఏమీ లేదు. వెన్నెలకిషోర్‌ పాత్ర కామెడీ సినిమాలో కాస్త బెటర్‌. ఇక బ్రహ్మాజీ పాత్ర కూడా ఏదోకామెడీని పండించే ప్రయత్నం చేసింది. శ్రద్దాదాస్‌ పాత్ర జస్ట్‌ ఓకే. సినిమాలో గొప్పగా ట్విస్టులు,మనసుకు హత్తుకునే సన్నివేశాలేం లేవు. యూత్‌ ఆలోచనలు ప్రేమ విషయంలో ఎలా ఉన్నాయనేదే సినిమా. రొమాంటిక్‌ సీన్స్‌, ఏరోటిక్‌ డైలాగ్స్‌తో సినిమాను తెరెక్కించారు.

బోటమ్‌ లైన్‌: 'హిప్పీ'.. బోరింగ్‌ రొమాంటిక్‌ డ్రామా

Read Hippi Movie Review in English

Rating : 2.0 / 5.0