విజయ్ సేతుపతిపై హిందూ సంఘాల ఆగ్రహం
- IndiaGlitz, [Saturday,May 09 2020]
తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సుపరిచితుడే. ఇప్పుడు ఈ వైరటీ నటుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ యాక్టర్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. అందుకు కారణంగా మూడు నెలల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలే. వివరాల్లోకెళ్తే.. సదరు ఛానెల్లో ఆగమశాస్త్రం ప్రకారం దేవుడు కైంకర్యం, సేవలు గురించి విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అంటున్నారు. దీంతో అఖిల భారత హిందూ సంఘం పోలీస్ కమీషనర్‌కు లేఖ రాసింది. విజయ్ సేతుపతిపై తగు చర్యలను తీసుకోవాలని కోరింది. సొంత ప్రచారం కోసం హిందూ మత దూషణే దొరికిందా? అని కూడా మండిపడింది.
విజయ్ సేతుపతి ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు మళ్లీ మాట్లాడలేదు. ఈయన తెలుగులో చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ చిత్రంలోనూ విలన్‌గా నటించాడు. ‘పుష్ప’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటించాల్సింది కానీ నటించలేదు. విజయ్ సేతుపతి చర్యపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మాట్లాడటానికి చాలా విషయాలు ఉండగా దైవ దూషణ ఎందుకు చేయడం? అని మాట్లాడుతున్నారు.