తెలుగు మార్కెట్ పై లుక్కేసిన హిందీ స్టార్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బి అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేస్తున్నారు. కత్రినా కైఫ్, సనా ఫాతిమా షేక్, రోనాల్ రాయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ఈ చిత్రాన్ని దక్షిణాదిన కూడా భారీగా విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా తెలుగు, తమిళంకు చెందిన వీడియో బైట్స్‌ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.
ఇందులో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌లు తెలుగు, తమిళంలో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' గురించి వ్యాఖ్యానించడం కొసమెరుపు. 1839 కాలం నాటి నవల 'కన్ఫెషన్స్ ఆఫ్ థగ్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజయ్, అతుల్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments