తెలుగు ద‌ర్శ‌కుల‌తో హిందీ చిత్రాలు

  • IndiaGlitz, [Monday,June 04 2018]

‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ చిత్రాల‌తో తెలుగు వారిని ప‌ల‌క‌రించిన ఉత్త‌రాది భామ అమైరా ద‌స్తూర్‌. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. ఓ వైపు లేడీ డైరెక్టర్ లీనా యాద‌వ్‌ డైరెక్షన్‌లో ‘రాజ్మా చావల్’ సినిమాలో నటిస్తోంది. అలాగే.. తెలుగులో ‘ప్రస్థానం’ సినిమాని తెరకెక్కించిన దేవా కట్టా.. ఇప్పుడు అదే సినిమాని హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఇందులోనూ అమైరానే క‌థానాయిక‌. కె.రాఘ‌వేంద్ర రావు త‌న‌యుడు ప్ర‌కాష్‌ కోవెలమూడి రూపొందిస్తున్న మ‌రో హిందీ చిత్రం ‘మెంటల్ హై క్యా’లోనూ ఓ క‌థానాయిక‌గా నటిస్తోంది.

ఈ సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ.. “హిందీలో నేను చేస్తున్న మూడు చిత్రాల్లో రెండు చిత్రాల‌ను ద‌క్షిణాదికి చెందిన‌ ద‌ర్శ‌కులు టేకాఫ్ చేయ‌డం ఆనందంగా ఉంది ఈ రెండు చిత్రాలు కూడా నాకు మంచి పేరు తీసుకువ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది” అంటూ ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది. హిందీలో చేస్తున్న‌ సినిమాలతోనైనా అమైరాకు విజయం వరిస్తుందేమో చూడాలి.

More News

గ్రామీణ నేపథ్యంలో వెంకీ, చైతు సినిమా?

విక్టరీ వెంకటేష్, యువ క‌థానాయ‌కుడు నాగ చైతన్య కథానాయకులుగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో

ద‌స‌రా టార్గెట్‌గా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌?

సమ్మర్ సీజన్ ముగిసింది. ఈ నేప‌థ్యంలో.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఆస‌క్తిక‌ర‌మైన‌ సినిమాలు కొన్ని విజయ దశమిని టార్గెట్ చేస్తూ చిత్రీకరణను కొనసాగిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్, రవితేజ బాటలో రాజ్ తరుణ్?

‘ఉయ్యాలా జంపాలా’, ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

పి.సి.శ్రీ‌రామ్ ట్రాక్ రికార్డ్ ప్ల‌స్ అవుతుందా?

ద‌క్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన కెమెరా పనితనంతో గొప్ప చిత్రాలుగా మలచిన ఘ‌న‌త‌ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సొంతం.

సంక్రాంతి సంద‌డి వీరిదేనా?

2019 సంక్రాంతి ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల‌లో. వినిపిస్తున్న క‌థ‌నాల ప్రకారం..