తెలుగు దర్శకులతో హిందీ చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ చిత్రాలతో తెలుగు వారిని పలకరించిన ఉత్తరాది భామ అమైరా దస్తూర్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు లేడీ డైరెక్టర్ లీనా యాదవ్ డైరెక్షన్‌లో ‘రాజ్మా చావల్’ సినిమాలో నటిస్తోంది. అలాగే.. తెలుగులో ‘ప్రస్థానం’ సినిమాని తెరకెక్కించిన దేవా కట్టా.. ఇప్పుడు అదే సినిమాని హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఇందులోనూ అమైరానే కథానాయిక. కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి రూపొందిస్తున్న మరో హిందీ చిత్రం ‘మెంటల్ హై క్యా’లోనూ ఓ కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ.. “హిందీలో నేను చేస్తున్న మూడు చిత్రాల్లో రెండు చిత్రాలను దక్షిణాదికి చెందిన దర్శకులు టేకాఫ్ చేయడం ఆనందంగా ఉంది ఈ రెండు చిత్రాలు కూడా నాకు మంచి పేరు తీసుకువస్తాయన్న నమ్మకం ఉంది” అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. హిందీలో చేస్తున్న సినిమాలతోనైనా అమైరాకు విజయం వరిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com